Moviesఉప్పెన బ్యూటీ లిప్‌కిస్ ఇంత హాట్‌గానా...! (వీడియో)

ఉప్పెన బ్యూటీ లిప్‌కిస్ ఇంత హాట్‌గానా…! (వీడియో)

ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. బెంగళూరుకు చెందిన కృతి శెట్టి తెలుగులో మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన‌ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. ఆమె అందచందాలకు తెలుగు సినిమా ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా పడిపోయారు. తన అందాలతో కృతి తెలుగు కుర్ర‌కారును మత్తెక్కించింది. దీంతో ఆమె తాజాగా నాని శ్యామ్ సింగ రాయ్‌ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కృతి హాట్ హాట్ గా ఓ లిప్ కిస్ కూడా ఇచ్చేసిందట.

ఇప్పటికే యూత్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి మరింత క్రేజ్ తో పాటు హాట్ ఇమేజ్ కోసమే రెండో సినిమాలోనే లిప్ లాక్ చేసిందని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. ఇక‌ నాని శ్యామ్ సింగ‌రాయ్‌ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న కృతి మోడ్ర‌న్ అమ్మాయిగా నటిస్తోందని ఆమె స్టిల్స్ చెబుతున్నాయి. తాజాగా శ్యామ్ సింగ‌రాయ్ టీజ‌ర్ రిలీజ్ అయ్యింది.

ఈ టీజ‌ర్లో నానికి చాలా ఘాటుగానే కృతి లిప్ కిస్ ఇచ్చింది. ఈ సినిమా త‌ర్వాత అవ‌కాశాల కోసం ఆమె గ్లామ‌ర్ గేట్లు ఎత్తేందుకు కూడా రెడీగానే ఉన్న‌ట్టు సంకేతాలు ఇచ్చేసింది. ఇక మ‌హేష్‌బాబు సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ రావొచ్చ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక శ్యామ్ సింగ రాయ్ లో నాటి ప‌క్క‌న సాయి ప‌ల్ల‌వి న‌టిస్తుంటే.. ప్రియురాలు పాత్ర‌లో కృతి క‌నిపించ‌నుంది.

ఇక డిసెంబ‌ర్ 24న వ‌రుణ్‌తేజ్ గ‌నితో పోటీ ప‌డుతూ శ్యామ్ సింగ రాయ్ థియేట‌ర్ల‌లోకి రానుంది. మ‌రి ఈ సినిమా కృతి శెట్టి కెరీర్‌ను ఎలా ట‌ర్న్ చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news