Moviesనాగ‌చైత‌న్య వ‌దులుకున్న బ్లాక్‌బ‌స్ట‌ర్లు... ఇవి చేసి ఉంటే నెంబ‌ర్ వ‌న్ హీరో...

నాగ‌చైత‌న్య వ‌దులుకున్న బ్లాక్‌బ‌స్ట‌ర్లు… ఇవి చేసి ఉంటే నెంబ‌ర్ వ‌న్ హీరో అయ్యేవాడు…!

అక్కినేని నాగ‌చైత‌న్య స‌మంత‌కు విడాకులు ఇచ్చేశాక పూర్తిగా త‌న కెరీర్ మీదే కాన్‌సంట్రేష‌న్ చేస్తూ దూసుకు పోతున్నాడు. చైతు వ‌రుస‌గా మ‌జిలీ, వెంకీ మామ‌, ల‌వ్‌స్టోరీ సినిమాల హిట్ల‌తో దూసుకు పోతున్నాడు. చైతు ఇటీవ‌ల నిర్మాత‌ల‌కు ప్రామీసింగ్ హీరోగా మారిపోయాడు. మ‌రో రెండు హిట్లు ప‌డితే చైతు మార్కెట్ ఖ‌చ్చితంగా స్టార్ హీరోల రేంజ్‌కు వెళ్లిపోతుంద‌ని కూడా ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ప్ర‌స్తుతం చైతు న‌టిస్తోన్న థ్యాంక్యు, బంగార్రాజు సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇస్తున్నాడు.

తండ్రితో క‌లిసి న‌టిస్తోన్న బంగార్రాజుపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక చైతు కొన్ని సినిమాలు వదులుకున్నాడు. అందుల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కూడా ఉన్నాయి. అవి కూడా చైతు చేసి ఉంటే చైతు కెరీర్ ఇప్పుడు ఖ‌చ్చితంగా మ‌రో రేంజ్‌లో ఉండేద‌నే చెప్పాలి. చైతు వ‌దులుకున్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

1- కొత్తబంగారులోకం :
అస‌లు చైతు ఈ సినిమాతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ క‌థ‌లోకి వ‌రుణ్‌తేజ్ ఎంట్రీ ఇచ్చాడు.

2- గౌర‌వం:
గౌర‌వం క‌థ ముందుగా చైతు ద‌గ్గ‌ర‌కే వ‌చ్చింది. అయితే చైతు ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేశాడు. త‌ర్వాత అల్లు శిరీష్ చేసిన ఈ సినిమాకు మంచి పేరు వ‌చ్చినా కూడా ప్లాప్ అయ్యింది.

3- భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌:
చైతు ద‌గ్గ‌ర‌కే ముందుగా మారుతి క‌థ తెచ్చాడు. అయితే చైతు బ్యాడ్ ల‌క్ ఈ క‌థ‌ను వ‌దులుకున్నాడు. త‌ర్వాత నాని చేసిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

4- అఆ
ఈ సినిమా నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ .ఇది చైతు మిస్ అయ్యాడు. ఈ సినిమా చైతు చేసి ఉంటే వేరేలా ఉండేది.

5- సుధీర్‌బాబు చేసిన స‌మ్మోహ‌నం కూడా చైతు మిస్ చేసుకుందే..!

6- రిప‌బ్లిక్‌:
చైతుతో ఆటోన‌గ‌ర్ సూర్య చేసిన ద‌ర్శ‌కుడు దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా రిప‌బ్లిక్‌. ముందుగా రిప‌బ్లిక్ క‌థ‌ను చైతుతో చేయాల‌ని అనుకున్నాడు దేవ క‌ట్టా. అయితే ఆ క‌థ త‌న‌కు సూట్ కాద‌ని.. చైతు వ‌దిలేయ‌డంతో అది చివ‌ర‌కు సాయితేజ్‌కు వెళ్లింది.

7- అజ‌య్ భూప‌తి మ‌హాస‌ముద్రం క‌థ‌ను చైతుకు వినిపించినా క‌థ న‌చ్చ‌లేద‌ని వ‌దిలేశాడు.

8- నాగ‌శౌర్య చేసిన వ‌రుడు కావ‌లెను క‌థ ముందుగా చైతు ద‌గ్గ‌ర‌కే వెళ్లినా చేయ‌లేదు

9- అన్నీ మంచిశ‌కున‌ములే క‌థ ద‌ర్శ‌కురాలు నందినీరెడ్డి ముందుగా చైతుకే చెప్పినా .. మ‌నోడు నో చెప్పాడు.

10- నాగార్జున న‌టించిన ఢ‌మ‌రుకం సినిమా క‌థ ముందుగా చైతుకు చెప్పినా త‌న ఇమేజ్‌కు సూట్ కాద‌ని వ‌దిలేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news