Newsసినిమాల‌కు బై చెప్పేస్తోన్న పెళ్లి సందD శ్రీల‌ల‌.. రీజ‌న్ ఇదే..!

సినిమాల‌కు బై చెప్పేస్తోన్న పెళ్లి సందD శ్రీల‌ల‌.. రీజ‌న్ ఇదే..!

సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమా ప్లాప్ టాక్‌తో కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది శ్రీ లీల‌. అమ్మ‌డు తాను న‌టించిన తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది. మ‌రో విచిత్రం ఏంటంటే సినిమాకు అనుకున్న టాక్ రాక‌పోయినా కూడా శ్రీలీల అంద‌చందాలే ఈ సినిమాను క‌మ‌ర్షియ‌ల్‌గా పాస్ చేయించాయ‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీలో ఉంది. అమ్మ‌డుకు అంద‌చందాల‌తో పాటు కాస్త న‌ట‌న కూడా బాగుంద‌న్న టాక్ రావ‌డంతో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టుల్లో శ్రీలీల‌కు హీరోయిన్ ఛాన్స్ లు వ‌స్తున్నాయి.

మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనే కాకుండా మ‌హేష్‌బాబు వంటి పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఆమెకు అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు. అయితే ఇప్పుడు కొంత కాలం ఆమె సినిమాల‌కు విరామం ఇవ్వ‌నుంద‌ట‌. ఆమె ఎంబీబీఎస్ చ‌దువుతుండ‌గానే పెళ్లి సందడిలో అవకాశం రావడంతో ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చింది. అయితే ఇప్పుడు కాబోయే డాక్ట‌ర‌మ్మ‌కు ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో తిరిగి హైద‌రాబాద్ నుంచి ముంబైకు వెళ్లిపోయింద‌ని తెలుస్తోంది.

ప‌రీక్ష‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఆమె సినిమాల‌ను త‌న మ‌న‌స్సులో నుంచి తీసేసివేసిన‌ట్టే అంటున్నారు. ఇక శ్రీలీల మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అమ్మ‌డిలో డ్యాన్స్ స్కిల్‌తో పాటు అందం, అభిన‌యం కూడా ఉండ‌డంతో మీడియం రేంజ్ హీరోలు, కొత్త హీరోలు కూడా శ్రీలీలే త‌మ సినిమాల్లో హీరోయిన్‌గా ఉండాల‌ని ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. ఇక మ‌హేష్‌బాబు సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ వ‌స్తుంద‌న్న ప్ర‌చారంతో శ్రీలీల క్రేజ్ అయితే ఎక్క‌డికో వెళ్లిపోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news