Moviesమ‌హేష్ - బాల‌య్య‌తో మ‌ల్టీస్టార‌ర్ ప్లానింగ్‌లో టాప్ డైరెక్ట‌ర్‌..!

మ‌హేష్ – బాల‌య్య‌తో మ‌ల్టీస్టార‌ర్ ప్లానింగ్‌లో టాప్ డైరెక్ట‌ర్‌..!

తెలుగు సినిమాల్లో ఇటీవ‌ల మ‌ల్టీస్టారర్ల ట్రెండ్ న‌డుస్తోంది. సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ యంగ్ స్టార్ హీరోల‌తో ఎక్కువుగా మ‌ల్టీస్టార‌ర్లు చేశాడు. వెంకీ – మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగ చైత‌న్య‌, రామ్‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశాడు. ప్ర‌స్తుతం దృశ్యం 2 ఓటీటీ రిలీజ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్‌లో మ‌రో అదిరిపోయే మ‌ల్టీస్టార‌ర్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ – సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు కాంబోలో ఓ మ‌ల్టీస్టార‌ర్ రానుంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం బాల‌య్య అఖండ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. అలాగే మ‌హేష్‌బాబు 14 రీల్స్, జీఎంబీ, మైత్రీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. థ‌మ‌న్ మ్యూజిక్ ఇస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌. ఈ క్ర‌మంలోనే బాల‌య్య – మ‌హేష్‌ల కాంబోలో టాప్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఓ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కొర‌టాల చిరుతో చేస్తోన్న ఆచార్య కంప్లీట్ చేసే ప‌నిలో ఉన్నారు. ఆ వెంట‌నే ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ త‌ర్వాత కొర‌టాల బాల‌య్య – మ‌హేష్‌ల మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేసేందుకు రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మూడేళ్ల క్రిత‌మే కొర‌టాల ఓ లైన్ అనుకున్నార‌ట‌. ఇప్పుడు ఆ లైన్‌ను డ‌వ‌ప‌ల్ చేయిస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

భారీ యాక్ష‌న్‌తో కూడిన మాస్ ఎంట‌ర్టైన్‌మెంట్‌తో పాటు సందేశాత్మ‌కంగా ఈ సినిమా క‌థ ఉండ‌బోతోంద‌ని అంటున్నారు. బాల‌య్య – మ‌హేష్ కాంబినేష‌న్ అంటే మామూలుగా షేక్ అవ్వ‌ద‌నే చెప్పాలి. మ‌రి ఈ కాంబినేష‌న్ ఎంత త్వ‌ర‌గా సెట్ అయితే టాలీవుడ్‌కు అంత పెద్ద పండ‌గే…!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news