NewsR R R ఒలీవియా మోరిస్‌కు ఇంత బ్యాగ్ గ్రౌండ్ ఉందా..!

R R R ఒలీవియా మోరిస్‌కు ఇంత బ్యాగ్ గ్రౌండ్ ఉందా..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తోంది. చ‌ర‌ణ్‌కు జోడీగా ఫారెన్ భామ ఒలీవియో మోరిస్ న‌టిస్తోంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ గ్లింప్స్‌, సాంగ్స్ హంగామా అయితే స్టార్ట్ అయిపోయింది.

మ‌రోవైపు ఎక్క‌డిక‌క్క‌డ బిజినెస్ స‌ర్కిల్స్‌లో ఇప్పుడు ఈ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తోంది. ఇక ఇటీవ‌లే ఈ సినిమా నుంచి ఊర‌మాస్ సాంగ్ నాటు నాటు రిలీజ్ అయ్యింది. నాటు నాటు సాంగ్‌తో రాజ‌మౌళి సినిమాపై ఒక్క‌సారిగా అంచ‌నాలు తారాస్థాయికి తీసుకు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా క‌నిపించిన ఒలీవియో బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలే ఉన్నాయి.

ఒలీవియో 1997లో లండ‌న్‌లో జ‌న్మించింది. ఆమె చిన్న‌ప్ప‌టి నుంచే అమ్మ‌మ్మ దగ్గర పెరిగింది. చిన్న ఏజ్‌లోనే టీవీ, ఫిల్మ్ రంగాల‌పై ఆస‌క్తి పెంచుకుంది. ఆమె పాఠ‌శాల విద్య‌లో ఉన్న‌ప్పుడే ఆర్టీఏ లెవ‌ల్లో శిక్ష‌ణ తీసుకుంది. త‌ర్వాత యాక్టింగ్ టీచ‌ర్‌గా కూడా ప‌నిచేసింది. త‌ర్వాత లండ‌న్లోనే రాయ‌ల్ వెల్ష్ మ్యూజిక్ డ్రామా కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ త‌ర్వాత ఏడు రోజుల్లోనే మినీ అడ్వెంచ‌ర్ టీవీ సీరిస్ కంప్లీట్ చేసి స‌రికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది.

ఒలీవియో లండన్ ఫ్యాషన్ వీక్‌తో సహా అనేక ఫ్యాషన్ వీక్ రాంప్ షోలలో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత ఆమె ఎన్టీఆర్ స‌ర‌స‌న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టించేందుకు ఎంపికైంది. ముందు నుంచి కూడా ఆమె ఎవ‌రు అన్న సెర్చింగ్ గూగుల్లో ఎక్కువుగా జ‌రిగింది. దీంతో ఆమెకు సంబంధించి ప‌లు ఇంట‌స్ట్రింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news