Moviesపునీత్ మ‌ర‌ణానికి షాకింగ్ రీజ‌న్ చెప్పిన మెగాస్టార్‌..

పునీత్ మ‌ర‌ణానికి షాకింగ్ రీజ‌న్ చెప్పిన మెగాస్టార్‌..

కన్నడ యంగ్ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం దేశవ్యాప్తంగా ఎంతో మందిని తీవ్రంగా కలిచివేసింది. దివంగత నటుడు.. కన్నడ కంఠ‌రీవ రాజ్ కుమార్ తనయుడు అయిన పునీత్ రాజ్ కుమార్ తక్కువ వయసులోనే స్టార్ హీరోగా ఎదిగారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు ద్వారా ఎంతోమంది ప్రజల హృదయాల్లో రియల్ హీరోగా చోటు దక్కించుకున్నారు. గత నెలలో వ్యాయామం చేస్తూ గుండెనొప్పి రావడంతో పునీత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత హాస్పిటల్‌కు తరలించిన కొద్ది నిమిషాలకే ఆయన ప్రాణం విడిచిన సంగతి తెలిసిందే.

పునీత్‌ మరణాన్ని ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణంపై ఎవరికివారు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం పునీత్ రాజ్‌కుమార్ మరణంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో యోధ లైఫ్ లైన్ డయాగ్న స్టిక్స్ ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మానికి మంత్రులు త‌ల‌సాని, హ‌రీష్‌రావు తో పాటు చిరంజీవి కూడా గెస్టులుగా వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఎండీ సుధాక‌ర్‌ను ముందుగా అభినందించిన చిరు పునీత్ మ‌ర‌ణంపై మాట్లాడారు. ఇటీవ‌ల చాలా మంది త‌మ ఆరోగ్యంపై అశ్ర‌ద్ధ‌తో ఉంటున్నార‌ని.. పునీత్ మంచి ఫిజిక్‌గా ఉంటాడ‌ని.. చూడ‌డానికి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవు.. చెడు అల‌వాట్లు లేవు అని.. అయితే వాళ్ల‌కు వంశ పారంప‌ర్యంగా హార్ట్ స‌మ‌స్య ఉంద‌ని.. ఆ జీన్స్‌లోనే ఉన్న ఈ స‌మ‌స్య గురించి తెలిస్తే పునీత్ ముందు జాగ్ర‌త్త‌లు తీసుకునేవాడ‌ని అన్నారు.

ఆ ఫ్యామిలీలో రాజ్‌కుమార్ హార్ట్ స్ట్రోక్‌తో చ‌నిపోయార‌ని.. పెద్ద కుమారుడితో పాటు రెండో కుమారుడికి కూడా ఇలాంటి స‌మ‌స్య‌లే వ‌చ్చాయ‌ని.. వారు కూడా ఇబ్బందిగానే బ్ర‌తుకుతున్నార‌ని.. అయితే అదే స‌మ‌స్య వంశ పారంప‌ర్యంగా త‌న‌కు కూడా వ‌స్తుంద‌న్న విష‌యం తెలియ‌కే పునీత్ ప్రాణాలు విడిచార‌ని చిరు వాపోయారు. అలాంటి ప‌రిస్థితి ఎవ్వ‌రికి రాకూడ‌ద‌ని.. అందుకే అందుబాటులో ఉన్న ఇలాంటి టెక్నాల‌జీలు వాడుకోవాల‌ని చిరు సూచించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news