Moviesయంగ్ రెబల్ స్టార్ తో రొమాన్స్ కు సిద్ధమైన ఓల్డ్ హాట్...

యంగ్ రెబల్ స్టార్ తో రొమాన్స్ కు సిద్ధమైన ఓల్డ్ హాట్ బ్యూటీ..?

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. ఇప్పుడు ఆయన కళ్లు అన్ని పాని ఇండియా మూవీల పైనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే పలు బడా ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్..తజాగా అర్జున్ రెడ్డి చిత్రంతో సంచ‌ల‌నాలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ త‌న 25వ సినిమా చేయ‌నున్నట్లు అధికారికంగా తెలియజేసారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన వివరాలతో పాటు టైటిల్ ను కూడా రివీల్ చేసింది. ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది.

అది ఏమిటంటే.. ఈ సినిమాలో స్పిరిట్ చిత్రం లో హీరోయిన్ గా మేకర్స్ కరీనాని సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాహుబలి చిత్రం తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో రొమాన్స్ చేసేందుకు బాలీవుడ్ హీరోయిన్లు అంతా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇక తాజాగా ఆ లిస్ట్ లో కరీనా కపూర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కరీనా ఇద్దరు పిల్లలకు తల్లి అయినాకూడా..అందంలో, ఫిట్ నెస్ విషయంలో కుర్ర హీరోయిన్లతో సమానంగా పోటీ పడుతోంది. ఒక్కవేళ ఈ వార్త నిజమైతే మాత్ర, ప్రభాస్ ఖరీన ఖపూర్ కాంబినేషన్ వెండితెరపై క్రేజీగా మారడం ఖాయం అంటున్నారు అభిమానులు. మరి ఈ విషయమై మేకర్స్ ఏం చెప్తారో చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news