Moviesశ్రియ తన కూతురుకి ఎంత మంచి పేరు పెట్టారో తెలుసా..?

శ్రియ తన కూతురుకి ఎంత మంచి పేరు పెట్టారో తెలుసా..?

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం హీరోయిన్‌గా న‌టించిన శ్రీయ .. రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌‌ని వివాహమాడిన విషయం తెలిసిందే. భర్త తో పాటు అక్కడే సెట్టిల్ అయినా.. ఈ అందాల ముద్దుగుమ్మ పెళ్ళి తర్వాత కూడా తన అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది. త‌న భ‌ర్త‌తో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటారు. అయితే రీసెంట్ గా ఆమె ఓ షాకింగ్ స్వీట్ న్యూస్ చెప్పింది.

గతేడాది తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పి అందరికి షాకిచ్చింది. “2020వ సంవత్సరం మొత్తం ప్రపంచం చాలా కష్టపెట్టింది. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. మాకొక ఏంజిల్‌ని ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను” అంటూ శ్రియ గుడ్ న్యూస్‌ను షేర్ చేసింది.

ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏంటంటే..శ్రియకు పాప పుట్టి ఏడాది అయింది. 2020లోనే కరోనా లాక్ డౌన్ టైమ్ లో శ్రియ గర్భం దాల్చింది. అదే టైమ్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాని ఆమె గర్భం దాల్చిన విషయాన్ని బయటకు పొక్కకుండా చాలా చక్కగా మేనేజ్ చేసింది శ్రియ. అంతేనా ఆ తరువాత కూడా డెలివరీ తర్వాత పాప మేటర్ ను ఏడాది పాటు బయట ప్రపంచానికి తెలియకుండా దాచడం నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలి.

కనీసం సోషల్ మీడియాలో పెట్టే ఫొటోల్లో కూడా తన గర్భం సంగతి తెలియకుండా శ్రియ జాగ్రత్తపడిందంటే.. ఎంత ప్లానింగ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే శ్రియ.. ఈ విషయాన్ని ఎలా దాచి ఉంచింది అంటూ అభిమానులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. తాజాగా తన బిడ్డకు ‘రాధా’ అంటూ నాయకరణం చేసినట్లు శ్రియ వెల్లడించింది. ‘ఈ రాధా నా బెస్ట్ ఫ్రెండ్’ అని ఆమె పేర్కొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news