Moviesగుడ్ న్యూస్ చెప్పనున్న నాని.. మరో క్రేజీ అనౌన్స్మెంట్.. ఎప్పుడంటే..?

గుడ్ న్యూస్ చెప్పనున్న నాని.. మరో క్రేజీ అనౌన్స్మెంట్.. ఎప్పుడంటే..?

అభిమానులు నాచురల్ స్టార్ నాని అని ముద్దుగా పిలుచుకునే హీరో నాని..మొదట సహాయ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత .. సినిమాల మీద ఆసక్తితో అష్టాచమ్మా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. తర్వాత ఎన్నో సినిమాలలో నటించి, తన కంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు నాని. ఓకానొక టైంలో బడా హీరోలకు సైతం కాంపీటిషన్ గా నిలిచిన ఈయన సినిమాలు..2019లో విడుదలైన ‘జెర్సీ’ సినిమా తరువాత నాని ఇప్పటివరకు సరైన సక్సెస్ ను అందుకోలేకపోయారు.

ఆయన నటించిన ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’, ‘టక్ జగదీష్’ లాంటి సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ‘వి’, టక్ జగదీష్’ రెండు సినిమాలు కూడా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమాలకు బ్యాడ్ టాక్ వచ్చినా కూడా.. ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇక ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో నటిస్తున్నాడు . టాక్సీవాల ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ తోపాటు లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాతోపాటు నాని ‘అంటే.. సుందరానికి’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాను చేస్తూనే నాని మరో క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టిన్నట్లు తెలుస్తుంది. నాని కెరీర్ లో 29వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 15న రానుంది. ఈమేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news