Moviesబ్రేకింగ్‌: విష‌మంగా ప‌వ‌ర్‌స్టార్ ఆరోగ్యం.. చేతులెత్తేసిన డాక్ట‌ర్లు

బ్రేకింగ్‌: విష‌మంగా ప‌వ‌ర్‌స్టార్ ఆరోగ్యం.. చేతులెత్తేసిన డాక్ట‌ర్లు

క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కు గుండె పోటు రావ‌డంతో ఈ రోజు 11.30 గంట‌ల‌కు ఆసుప‌త్రిలో అడ్మిట్ చేశారు. అయితే ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని బెంగ‌ళూరులోని విక్ర‌మ్ హాస్ప‌ట‌ల్ వైద్యులు డాక్ట‌ర్ రంగ‌నాథ్ నాయ‌క్ చెప్ప‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఉద‌యం ఇంట్లో ఉండ‌గానే గుండెపోటు రావ‌డంతో వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

హాస్ప‌టల్లో ఐటీయూలో ఉంచి ఓవైపు వైద్యులు చికిత్స చేస్తున్నా కూడా ప‌రిస్థితి అదుపులోకి రావ‌డం లేద‌ని తెలుస్తోంది. పునీత్ జిమ్‌లో వ్యాయామం చేస్తుండ‌గా చాతిలో నొప్పిగా ఉంద‌ని చెప్ప‌డంతో ఆయ‌న్ను హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్లారు. మ‌రోవైపు వైద్యులు సైతం ప‌రిస్థితి తీవ్రంగా ఉండ‌డంతో తాము అప్పుడే ఏం చెప్ప‌లేమని అన‌డంతో క‌న్న‌డ సినీ అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు.

పునీత్‌కు గుండె పోటు రావ‌డానికి నాలుగు గంట‌ల ముందే ఆయ‌న బ‌జ‌రంగీ – 2 సినిమా హిట్ అయినందుకు యూనిట్‌కు శుభాకాంక్ష‌లు కూడా చెప్పారు. పునీత్ రాజ్‌కుమార్ అన్న శివ‌రాజ్ కుమార్ కుమార్తె నివేదిత‌తో పాటు క్రేజీ స్టార్ ర‌విచంద్ర‌న్‌, నిర్మాతలు జ‌య‌న్న‌, కేపీ శ్రీకాంత్ హుటాహుటీన ఆసుప‌త్రికి చేరుకున్నారు.

ఇక పునీత్ వ‌య‌స్సు 46 సంవ‌త్స‌రాలు. క‌న్న‌డ కంఠ‌రీవ రాజ్‌కుమార్‌కు పునీత్ మూడో కుమారుడు. యువ‌ర‌త్న సినిమాతో పునీత్ సినిమాల్లోకి వ‌చ్చాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news