Gossipsతెలిసి తప్పు చేస్తున్న శృతీహాస‌న్‌.. షాకింగ్ డెసిషన్..?

తెలిసి తప్పు చేస్తున్న శృతీహాస‌న్‌.. షాకింగ్ డెసిషన్..?

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బాల‌య్య మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రెడీ అవుతున్నారు. మ‌రో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ సినిమాను బాల‌య్య ఓకే చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాపై కూడా అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ వారు ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా థ‌మ‌నే మ్యూజిక్ అందిస్తున్నారు. ఓ వాస్త‌వ సంఘ‌ట‌న ఆధారంగా గోపీచంద్ ఈ సినిమా క‌థ రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ట‌. ఈ సినిమాలో హీరోయిన్ల గురించి కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. శృతీహాస‌న్‌, మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా ఫైన‌ల్ అయ్యార‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌నే బాల‌య్య కోసం మ‌లినేని ఫిక్స్ చేశార‌ని అంటున్నారు. నిజానికి మొదట ఆమె ఈ పాత్రకు ఒప్పుకోలేదట. కానీ గోపీచంద్ తో ఉన్న అనుబంధంతో శృతిహాసన్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోక తప్పలేదని తెలుస్తుంది.

ఇందులో బాలకృష్ణ భార్యగా ఓ గృహిణి పాత్రలో శృతి హాసన్ కనిపించనుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఆమె లావు పెరుగుతుందట. ప్రస్తుతం ఎంతో స్లిమ్ గా ఉన్నటువంటి శృతిహాసన్ బాలయ్య సినిమాలో నటించడం కోసం శరీర బరువు పెంచడానికి ట్రై చేస్తుందట. ఈ విషయం తెలిసిన శృతి అభిమానులు లావు పెరిగి కోసం తన కెరీర్ ను నాశనం చేసుకోబోతోందా అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో వీరిద్దరి జోడి ఏవిధంగా ఉండబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

Latest news