Moviesప్రభుదేవా సినీ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా..??

ప్రభుదేవా సినీ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా..??

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభుదేవా గురించి తెలియని వారంటూ ఉండరన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ కొడుకుగా మనకు బాగా తెలుసు. ప్రభుదేవా డ్యాన్స్ ఇరగదీస్తాడు . ఇక ఆయన ఒక్క డాన్స్ మాస్టర్ మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన కొన్ని సినిమాలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ప్రభుదేవా డైరెక్టర్ గా మరి పలు సినిమాలను చిత్రీకరించారు. ఆయన తీసిన సినిమాల్లో ఎన్నో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూలు రాబట్టాయి.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఎగుమతి అయినా సౌత్ స్టార్ లలో ఒకరు ప్రభుదేవా.. డాన్సర్ గా గొప్ప పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ప్రభుదేవా ఆ తర్వాత ఎన్నో అవతారాలు ఎత్తాడు.. కొరియోగ్రాఫర్ గా ఎన్నో శిఖరాలను అధిరోహించిన ప్రభుదేవా డైరెక్టర్ గా మారాడు.. డైరెక్టర్ గా కూడా మంచి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. అయితే, కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ కండల వీరుడు సల్మాణ్ ఖాన్ హీరోగా.. దిశా పటానీ హీరోయిన్‌గా ఆయన ‘రాధే’ అనే సినిమాను తీసాడు. అయితే ఈ సినిమాపై ఎన్నో అంచ్నాలు పెట్టుకున్నారు.

అయితే ఈ సినిమా ఊహించినంత రెస్పాన్స్ రాలేదు కదా.. భారీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్, యాక్షన్ సీన్లతో తెరకెక్కిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటిటి లో రిలీజ్ అయినా ఈ సినిమా కి దారుణమైన ఫ్లాప్ టాక్ వచ్చింది. సల్మాన్ ఖాన్ తో రాధే కన్నా ముందు తీసిన దబాంగ్ 3 డిజాస్టర్. అయినా సల్మాన్ ఖాన్ రాధే కి ప్రభుదేవా కే అవకాశం ఇచ్చాడు. మరి రాధే కి ప్రభుదేవా న్యాయం చేశాడా అంటే..లేదనే అంటున్నారు ప్రేక్షకులు. ఇక అప్పటి నుండి ప్రభుదేవా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. కొందరైతే ఆ సినిమాతోనే ప్రభుదేవ సినీ కెరీర్ నాశనం అయ్యిందంటున్నరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news