Moviesహాస్పిటల్ లో అడ్మిట్ అయిన అడివి శేష్.. అభిమానుల్లో టెన్షన్..!!

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అడివి శేష్.. అభిమానుల్లో టెన్షన్..!!

టాలీవుడ్లో వైవిధ్యభరితమైన సినిమాలు చేసే అడవి శేష్..మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన ఆయన తర్వాత హీరో గా మారాడు.. కర్మ సినిమా తో వచ్చిన అడవిశేష్ పవన్ కళ్యాణ్ పంజా సినిమాతో మంచి పాపులారిక్ దక్కించుకున్నాడు. ఆ సినిమాలో సైకో విలన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అది తర్వాత బలుపు చిత్రంలో కూడా విలన్ గాచేశాడు. ఓవైపు ప్రత్యేక పాత్రలు పోషిస్తూనే హీరోగా చేస్తూ వచ్చాడు శేష్.

క్షణం సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.. క్షణం సినిమాలో శేష్ నటనకు అందరు ఫిదా కాగా, గూఢచారి తో హీరో గా నిలదొక్కుకున్నాడు అడవిశేష్. ప్రస్తుతం మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ లో మేజర్ సినిమా చేస్తుండగా, నాని నిర్మాణంలో హిట్ సీక్వెల్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా తెలుగు, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈయ‌న క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం మేజ‌ర్‌ను మ‌న ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

ఇప్ప‌టికే కోవిడ్ కార‌ణంగా ఆగిన మేజ‌ర్ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ త‌రుణంలో త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని అనుకుంటూ ఉండ‌గా మేజర్ టీమ్‌కు షాక్ తగిలింది. అదేంటంటే, అడివిశేష్‌కు గ‌త వారం డెంగ్యూ జ్వరం వ‌చ్చింది. ప్లేట్ లెట్ల సంఖ్య బాగా పడిపోవడంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది. శేష్ ఆరోగ్యాన్ని డాక్ట‌ర్స్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దీంతో ఆయన అభిమాను టెన్షన్ పడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news