Moviesఆ దర్శకుడికి మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..ఏం చేసిందో...

ఆ దర్శకుడికి మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..ఏం చేసిందో తెలుసా..??

చిన్న వయసులోనే సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసిన హన్సిక తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందం, అభినయం, అమాయకత్వం అన్ని కలగలిపితే హన్సిక అనడంలో సందేహమే లేదు. దేశముదురు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ హన్సిక, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది.

కొంత కాలానికి తెలుగులో ఫేడ్ అవుట్ అయిన ఈ బొద్దు బ్యూటీ తమిళంలో మాత్రం తన స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూనే ఉంది. బబ్లీ బ్యూటీ హన్సిక ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. తమిళంలో ఈ పాప అదిరిపోయే ఆఫర్లతో రచ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’ అనే సినిమాలో నటిస్తోంది. రాజు దుస్సా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం ఒకే ఒక్క క్యారెక్టర్ తో నడుస్తుంది.

అయితే ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్భంగా హన్సిక మాట్లాడుతూ.. “ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నిటిలో కంటే ఇది చాలా టఫ్‌గా అనిపించింది. కథను చెప్పినట్లుగానే దర్శకుడు ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అందరం చాలా కష్టపడి చేసిన ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాము” అని తెలిపింది.

ఈ సందర్భంగా దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ ..ఈ సినిమాలో ప్రతి షాట్ 20 నుంచి 25 నిమిషాల పాటు ఉంటుంది అని..సింగిల్‌ షాట్‌ని హన్సిక సింగిల్‌ టేక్‌లో చేశారని, అందువల్లే ఈ సినిమాను కేవలం ఆరు రోజుల్లోనే పూర్తి చేయగలిగాం అని దర్శకుడు రాజు దుస్సా అన్నారు. ఇక ఈ సినిమాలో హన్సిక యక్టింగ్ చూసి..డైరెక్టర్ మైండ్ బ్లాక్ అయ్యిందట. ఇది వరకు ఎప్పుడు చూడని హన్సిక ఈ సినిమాలో చూపిస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news