Moviesసమంత మహా "నాటీ"..ఏం చేసిందో చూడండి..!!

సమంత మహా “నాటీ”..ఏం చేసిందో చూడండి..!!

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. సినీ ఇండస్ట్రీని ఏలేసి..ఆ తరువాత అక్కినేని వారింట కోదలిగా అడుగుపెట్టింది సమంత. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్యను పెళ్లాడిన ఆమె మ్యారేజ్ తర్వాత అక్కినేని అనే బ్రాండ్‌తో మరింత పాపులారిటి పెమొచుకుని తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. సినిమాలు ఒక్కటే కాదండోయ్.. వ్యాపారాలు, ఫ్యాషన్ ఇలా అన్నింటా నేనే నెం.1 అంటూ ముందన్నట్లుగా హవా నడిపిస్తోంది ఈ అక్కినేని కోడలు పిల్ల. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత తనకు నచ్చినట్లుగా ఉంటూ అక్కినేని కోడలి రూటే సపరేటు అనిపించుకుంటోంది. ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి భర్త నాగ చైతన్యతో రొమాంటిక్ టూర్స్ వేస్తూ ఉంటుంది.అంతేనా.. ఆయా ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడం సమంత హ్యాబీ.

స‌మంత ప్ర‌స్తుతం క‌థానాయిక ప్రాధాన్య‌త ఉన్న సినిమాల్లోనే నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్పుడు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంతలం అనే చిత్రంలో న‌టిస్తున్నారు అక్కినేని కోడ‌లు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ శాకుంతలం సినిమా నుంచి ఒక ఫొటో షేర్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫొటోలో మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ సమంతకు మేకప్ వేస్తూ కనిపించింది. ఈ ఫొటోలో సమంత గ్రీన్ కుర్తా ధరించి చాలా అందంగా కనిపించింది. ఇకపోతే సమంత అక్కినేని నటిస్తున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ప్రిన్స్ భారత పాత్రలో నటించనుంది. అదితి బాలన్, మోహన్ బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

అయితే సమంత ఇప్పుడు అలా క్యారవ్యాన్‌లో చేసిన ఈ అల్లరి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా సమంత ఓ కొత్త యాప్‌ను వాడేసి ఆమె మేకప్ మెన్ అయిన సాధన సింగ్ శరీర భాగాన్ని పెంచేశారు. సాధన సింగ్ సమంతకు మేకప్ వేస్తున్న క్రమంలో ఆమె నడుము భాగం కాస్త ముందుకు వచ్చినట్టు కనిపించి.. నా పొట్ట భాగాన్ని లోపలకి పంపించే యాప్ ఏదైనా ఉందా? అన్నట్లు సమంతని అడుగుతుంది. దానికి సమంత పొట్ట లోపలకి పోవాల్సింది పోయి.. బయటకు వచ్చేలా చేశారు.. అనే పిక్స్ పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లోవైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news