GossipsSomething Special: మోనాల్ పై పడ్డ ఆ బడా హీరో కళ్లు..??

Something Special: మోనాల్ పై పడ్డ ఆ బడా హీరో కళ్లు..??

మోనాల్ గజ్జర్..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ 4 తెలుగు సీజ‌న్లో ఉన్న ఒకే ఒక హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్‌. ఆమె తెలుగులో అల్ల‌రి న‌రేష్ మూవీ సుడిగాడుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత వెన్నెల 1 1/2, ఒక కాలేజీ స్టోరీ, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి సినిమాల్లోనూ మెరిసింది. అయితే ఆమెను మ‌న ప్రేక్ష‌కులు పెద్ద‌గా గుర్తుంచుకోలేదు. అప్ప‌టిదాకా ప‌లు సినిమాల్లో న‌టించినా బిగ్ బాస్ తో ఈ బ్యూటీకి క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది.

షో నుంచి బయటకు రాగానే.. ఓ డ్యాన్స్‌ షోకి జడ్జిగా వ్యవహరించింది. అంతేకాదు మోనాల్ గ‌జ్జ‌ర్ అల్లుడు అదుర్స్ చిత్రంలో సోనూసూద్‌, బెల్లంకొండ శ్రీనివాస్ తో క‌లిసి స్పెష‌ల్ సాంగ్ లో స్టెప్పులేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సాంగ్‌లో మోనాల్ చిందులాట బాగా అట్రాక్ట్ చేయడమే గాక, ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు మోనాల్ ఇంకొక గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు అనే వార్త వినిపిస్తోంది. ఈ సుంద‌రి మ‌రోసారి ఐటెం సాంగ్ లో మెరువ‌నుంద‌న్న వార్త హాట్ టాపిక్ గా మారింది.

మోనాల్ గ‌జ్జ‌ర్ ఖాతాలో భారీ ఆఫ‌ర్ వ‌చ్చి ప‌డ్డ‌ట్టు టాలీవుడ్ కోడైకూస్తుంది. ఇప్పుడు నాగార్జున చేస్తున్న ‘బంగార్రాజు’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ గజ్జర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోనాల్‌తో చర్చలు ముగిశాయని తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ లోనే మోనాల్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.

ఒక‌వేళ ఈ ఆఫ‌ర్ నిజ‌మైతే మోనాల్ కెరీర్‌కుఇక తిరుగుండదని అంతా అనుకుంటున్నారు. సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రంలో అన‌సూయ కూడాస్పెష‌ల్ సాంగ్ లో క‌నిపించ‌గా అద్బుత‌మైన స్పంద‌న వచ్చింది. ఆ తరువాత ఆమె దశ తిరిగిపోయింది.. మ‌రి మోనాల్ కు బంగార్రాజు చిత్రం ఎంత వ‌ర‌కు సాయ‌ప‌డుతుందో వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news