Gossipsఎన్టీఆర్ ని మార్చేస్తున్న ఆ డైరెక్టర్..??

ఎన్టీఆర్ ని మార్చేస్తున్న ఆ డైరెక్టర్..??

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస పెట్టి సినిమాలు అంగీక‌రించుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత కొర‌టాల శివ సినిమాను ఓకే చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాతో పాటు ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో కూడా ఓ సినిమాకు క‌మిట్ అయ్యాడు. ఇక కొర‌టాల శివ డైరెక్ట్ చేసే సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ – యువ‌సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మిక్కిలినేని సుధాక‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ రోల్ చేయ‌నున్నాడ‌ట‌. ఆర్ఆర్ఆర్ పూర్తైన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ఇక ఈ సినిమా కథను బట్టి తన మేక్ఓవర్ ను చేంజ్ చేసుకుంటున్నారట మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొమురం భీమ్‌ పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్‌ కొచెం బరువు పెరిగినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ పాత్రలో ఎన్టీఆర్‌ ఆదివాసీ బిడ్డగా కాస్త రఫ్ లుక్‌లోనే కనిపిస్తున్నాడు. అయితే కొరటాల శివతో చేస్తున్న తదుపరి సినిమా కోసం రెగ్యులర్‌గా కన్నా కూడా ఎన్టీఆర్‌ కాస్త సన్నబడాలట. ఇప్పుడు కొరటాల శివ కోసం తిరిగి బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నారట. గతంలో కూడా తారక్ యమదొంగ సినిమా కోసం ఏకంగా 30 కిలోల బరువు కూడా తగ్గి, స్లిమ్ లుక్ లో కనిపించాడు. ఇక ఇప్పుడు కొరటాల సినిమా కోసం ఎంత బరువు తగ్గుతాడు తెలియాలి.

ప్ర‌స్తుతం ఆచార్య సినిమాను ఫినిష్ చేస్తోన్న కొర‌టాల ఆ త‌ర్వాత ఎన్టీఆర్ స్క్రిఫ్ట్‌పై మ‌రింత క‌స‌ర‌త్తులు చేయ‌నున్నాడు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే. 2016 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించింది. బాక్సాఫీస్ దగ్గర రు. 127 కోట్ల రూపాయలు కొల్ల‌గొట్టిది జనతాగ్యారేజ్. మళ్లి అలాంటి క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో టాలీవుడ్ కి మరో బ్లాక్ బస్టర్ పక్క అంటున్నారు తారక్ అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news