Moviesరాఘవేంద్రరావును అవమానించిన ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాక్...

రాఘవేంద్రరావును అవమానించిన ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అయ్యిపోతారు..?

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు తారసపడతాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అంటే కమర్షియల్‌ చిత్రాలకు పెట్టింది పేరు. కమర్షియల్‌ చిత్రాల ట్రెండ్‌ సృష్టించారాయన. వెండితెరపై గ్లామర్‌ని పరిచయం చేశారు. వీటిలో ముఖ్యంగా రాఘవేంద్రుడికే సొంతమైన ప్రత్యేకమైన శైలి ఒకటుంది. అదే ఎంతో రొమాంటిక్‌గా హీరోయిన్ బొడ్డుపై పండు విసరడం. హీరోయిన్లను శృంగార దేవతలుగా చూపించడంలో కె.రాఘవేంద్రరావు తరువాతనే ఎవరైనా అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

ఆయన హీరోయిన్ల నాభిపై పూలు, పండ్లు వేస్తూ పాటలను అత్యంత శృంగార భరితంగా రూపొందిస్తారు. రాఘవేంద్రరావు సినిమాల్లోని పాటల కోసమే ప్రేక్షకులు థియేటర్లకు పలుమార్లు వెళ్లేవారు అంటే అతిశయోక్తి కాదు.ఈయనతో సినిమా తీయాల్స్ని ప్రతి హీరో కోరుకుంటాడు. అలాంటి ఛాన్స్ వస్తే ఎవరైన మిస్ చేసుకుంటారా..?? లేదు. కానీ,టాలీవుడ్ స్టార్ హీరో రాఘవేంద్ర రావు సినిమాను రిజెక్ట్ చేసారు. ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..?? ఆయన మరెవరో కాదండి.. మన మాస్ మహా రాజా రవితేజ.

బాలకృష్ణ తో తెరకెక్కించిన పాండురంగడు అనే సినిమాను ముందుగా ఆయ‌న‌తో కాకుండా మాస్ మహా రాజ ర‌వితేజ‌తో చేయాల‌ని ద‌ర్శ‌కేంద్రుడు అనుకున్నారట. కాగా… ఈ సినిమా రవితేజతో చేస్తే ఎలా ఉంటుందని ఒకానొక దశలో ఆయన ఆలోచన చేశారట.ఈ విషయాన్ని అమెరికాలో ఓ కార్యక్రమంలో కలిసిన రవితేజతో చెప్పితే.. అప్పుడు రవితేజ ఓ డైలాగ్ కొట్టారట. “సార్ నా ఫేస్ కు పాండురంగడు కథకు ఏ మాత్రం సూట్ కాద”ని చెప్పాడ‌ట‌. అప్పుడు రాఘవేంద్రరావు ఈ పాండురంగ‌డు సినిమాను బాలకృష్ణ తో తెరకెక్కించగా అది బాక్స్ ఆఫిస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news