అనుపమా పరమేశ్వరన్ అంటే ఎవ్వరికైనా పద్దతి గల రూపమే గుర్తుకు వస్తుంది. చూడగానే భలేఉందే అనిపించే రూపుతో.. ఆడియన్స్ కు కనెక్ట్ అయిపోయిందీ బ్యూటీ. దీంతో.. ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినప్పటికీ.. తనదైన ముద్ర వేసిందీ అమ్మడు. ఎప్పుడూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూనే ఉంటుంది. చీరలు లేదా, పంజాబీ డ్రెస్సుల్లో కనిపిస్తూ నెటిజన్లను కట్టిపడుస్తూనే ఉంది.
కేరళ కుట్టి అనుపమా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే సందడికి నెటిజన్లు ఫిదా అవాల్సిందే. చిన్న పిల్లలా మారి చేసే కొంటె చేష్టలు, తన తమ్ముడితో కలిసి చేసే అల్లరిని నెటిజన్లు బాగా ఇష్టపడుతుంటారు. అయితే వెండి తెరపై క్యూట్‌గా కనిపించే ఈ భామ ఎప్పుడూ కూడా తన లిమిట్స్ లోనే ఉంటూ.. అందాల ఆరబోతకు అంత మొగ్గు చూపలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మధ్య కాస్త ఘాటుదనాన్ని జోడిస్తుందిలేండి.
తాజాగా.. ఇన్ స్టాగ్రామ్ లో ఓ న్యూడ్ ఫొటో షేర్ చేసింది. మొత్తం ఫొటో కాకుండా.. నడుము నుంచి తొడలవరకు కనిపించే ఫొటోను పోస్ట్ చేసింది. మహిళల శరీరాకృతి, ఆడవారి మీద జరిగే వివక్ష గురించి ఆమె ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. మహిళలు ఇళా ఉండాలి.. అలా ఉండాలి అని నిర్దేశిస్తుంటారని,మహిళలు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా ఇలా ఎలా ఉన్నా కూడా విమర్శలు చేయడం కామన్ అయ్యిపోయిందని. లావుగా ఉంది, జీరో సైజులో లేదు.. ఎక్కువగా తినకండి అని కొందరు..మరికొందరు ఏమో మరీ అంత తక్కువగా తినకండి అని అంటుంటారు.. ఇలా అడుగడునా ఆంక్షలు పెడతారంటూ వచ్చిన పోస్ట్‌లను అనుపమా షేర్ చేశారు.