Moviesఆ ఒక్క కారణంతో రాజమౌళిని రిజెక్ట్ చేసిన పవన్..అదేమిటో తెలుసా..??

ఆ ఒక్క కారణంతో రాజమౌళిని రిజెక్ట్ చేసిన పవన్..అదేమిటో తెలుసా..??

విక్రమార్కుడు 2006 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో రవితేజ, అనుష్క ముఖ్యపాత్రల్లో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. ‘విక్రమార్కుడు’ సినిమా స్టోరి పాతదే. కానీ ఆ ఓల్డ్‌ థియరీనే గోల్డెన్‌ మూవీగా మార్చేశారు డైరెక్టర్‌ రాజమౌళి. అందుకే జనం ‘విక్రమార్కుడు’ కు జై కొట్టారు.

విక్రమ్ రాథోడ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. చిల్లరమల్లర వేషాలేసే అత్తిలి సత్తిబాబు.. ఏమాత్రం పొంతన లేని ఈ రెండు క్యారెక్టర్లనీ కలిపి.. సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మూవీ విక్రమార్కుడు. రవితేజ కెరీర్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా విక్రమార్కుడు స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక కీరవాణి సంగీతం ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అని చెప్పాలి. ‘జింతాక్ తాక్’ మరియు ‘జుం జుం మాయ’ వంటి పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా అతను అలరించాడు. అంతేకాదు.. విక్రమార్కుడు’ చిత్రానికి రూ.11.93 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.95 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకు రూ.7.02 కోట్ల లాభాలు దక్కాయని చెప్పొచ్చు.

ఇక విక్రమార్కుడు సినిమా కథ రవితేజ కోసం రాసుకోలేదంట .. ఆ పవర్ ఫుల్ కథ ఒక స్టార్ హీరో చేస్తే ఇండస్ట్రీ హిట్ కొట్టొచ్చు అనే ఉద్దేశంతో పవన్ క‌ల్యాణ్ కు ఈ కథ చెప్పాలని చూశారంట. అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే బంగారం సినిమా షూటింగ్ బిజీ ఉన్నారట. అయితే కథ విన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కధ బాగానే ఉంది కానీ ఇప్పుడు కాదు తర్వాత చూద్దాంలే అని అన్నారట. రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్బంలో.. ఇక ఇప్పుడు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఈ స్టోరీ వెలుగులోకి వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news