Moviesపవన్ కి ఆ పేరు చెప్పితే పిచ్చ కోపం వస్తాది.. ఎందుకో...

పవన్ కి ఆ పేరు చెప్పితే పిచ్చ కోపం వస్తాది.. ఎందుకో తెలుసా..??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పేరులోనే పవర్ ఉంది. పవన్ కళ్యాణ్ కు ఉన్న భారీ క్రేజ్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే. పవన్ కళ్యాణ్… ఈ పేరు చెప్పితే ఆయన ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చినట్ల్లు ఊగిపోతారు. టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన పవన్.. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మన్నన పొందారు. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే భీబత్సమైన ఫ్యాన్ ఫాలొయింగ్ సంపాదించుకున్న స్టార్ర్ హీరో.. పవన్ మాత్రమే. పవన్ కళ్యాణ్‌కు మొదటి నుంచి సామాజిక స్పృహ ఎక్కువగా ఉండేది. అందుకే కాబోలు ఆయన రాజకీయాల్లో రంగ ప్రవేశం చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని, ఆ తరువాత ప్రజాసేవ మీద ఉన్నటువంటి అభిమానంతో రాజకీయాల్లోకివచ్చి, ప్రజలందరితో కలిసి మమేకం అవుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత ప్రస్తుతానికి అటు రాజకీయాలతో, ఇటు సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే పవన్ గురించి ఓ విష్యం నెట్టింట బాగా వైరల్ గా మారింది. అసలు ఈ విషయం ఆయన అభిమానులకు కూడా చాలా తక్కువ మందికే తెలుసట. అదేమిటంటే.. పవన్ కళ్యాణ్ కి ఓ సినిమా పేరు చెప్పితే చిరెత్తుతుందట. షాకింగ్ ఏమిటంటే.. అది ఆయన నటించిన మొదటి సినిమానే. యస్..అవును.. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పేరు చెప్పితే పవన్ కి పట్టారాని కోపం వస్తుందట.. ఎందుకు అనుకుంటున్నారా..?? అయితే ఇది చదవండి మీకే తెలుస్తుంది…

పవన్ ఇంటర్ లో ఫెయిల్ అవ్వడంతో ఆయన చదువు మానేసి మార్షల్ ఆర్ట్స్ వైపు అడుగులు వేసి బ్లాక్ బెల్ట్ సాధించారు. ఒకానోక్క సమయంలో పవన్ బౌద్ధమతంలో చేరిపోవాలని దృఢంగా నిశ్చయించుకుని.. ఇంటి నుంచి పారిపోయారట.ఇక చివరికి నాగబాబు, చిరంజీవి పవన్ ని వెతికి పట్టుకొని డైరెక్టర్ ఈ.వి.వి సత్యనారాయణ ని పిలిచి పవన్ కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను కట్టబెట్టారు.

దీనితో ఆయన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ని వెండి తెరకు హీరోగా పరిచయం చేశారు. దీంతో ఈ సినిమా పేరు వినగానే ఆయనకు తన జీవితంలో జరిగిన ఎన్నో ఘోరమైన ఘటనలు గుర్తుకొస్తాయి.ముఖ్యంగా తాను ఇంటి నుంచి పారిపోయిన విషయం పవన్ కళ్యాణ్ ని బాగా ఇబ్బంది పెడుతుంది. అందుకే ఆయన తన మొదటి సినిమా గురించి ఆలోచించడం పూర్తిగా మానేశారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news