Moviesఎన్టీఆర్‌కు కొర‌టాల క‌థ న‌చ్చ‌లేదా... !

ఎన్టీఆర్‌కు కొర‌టాల క‌థ న‌చ్చ‌లేదా… !

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస పెట్టి సినిమాలు అంగీక‌రించుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత కొర‌టాల శివ సినిమాను ఓకే చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాతో పాటు ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో కూడా ఓ సినిమాకు క‌మిట్ అయ్యాడు. ఇక కొర‌టాల శివ డైరెక్ట్ చేసే సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ – యువ‌సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మిక్కిలినేని సుధాక‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ రోల్ చేయ‌నున్నాడ‌ట‌. ఇక ఎన్టీఆర్ సినిమా కోసం త‌న టీంతో క‌లిసి నాలుగైదు నెల‌లుగా క‌థ‌పై క‌స‌ర‌త్తులు చేసి .. ఓ కొలిక్కి తెచ్చిన కొరటాల శివ ఎట్ట‌కేల‌కు దానిని ఎన్టీఆర్‌కు వినిపించాడ‌ట‌. అయితే ఆ ఫైన‌ల్ స్క్రిఫ్ట్ ఇటు ఎన్టీఆర్‌కు, ఇటు నిర్మాత‌ల‌కు ఇద్ద‌రికి న‌చ్చలేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఈ స్టోరీని మ‌రింత డ‌వ‌ల‌ప్ చేయ‌డం లేదా.. మ‌రో స్క్రిఫ్ట్ ఎన్టీఆర్‌కు వినిపించాల‌ని నిర్మాత‌లు కొర‌టాల‌కు సూచించిన‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఆచార్య సినిమాను ఫినిష్ చేస్తోన్న కొర‌టాల ఆ త‌ర్వాత ఎన్టీఆర్ స్క్రిఫ్ట్‌పై మ‌రింత క‌స‌ర‌త్తులు చేయ‌నున్నాడు. ఏదేమైనా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే కొర‌టాల – ఎన్టీఆర్ సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. మ‌రి అప్ప‌ట‌కి అయినా కొర‌టాల అదిరిపోయే క‌థ‌తో ఎన్టీఆర్‌, నిర్మాత‌ల‌ను మెప్పిస్తాడేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news