Gossipsబిగ్‌బాస్‌లో ఆలీ... ఆ హీరోయిన్ కూడా ...!

బిగ్‌బాస్‌లో ఆలీ… ఆ హీరోయిన్ కూడా …!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా నాలుగు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో ఐదో సీజ‌న్‌కు రెడీ అవుతోంది. ఈ సీజ‌న్‌ను కూడా నాగార్జునే హోస్ట్ చేయ‌డం దాదాపు ఖ‌రారైంది. ఇదిలా ఉంటే ఐదో సీజ‌న్లో హౌస్‌మెట్స్‌గా ఎవరెవ‌రు ఉంటార‌న్న‌దానిపై పెద్ద స‌స్పెన్స్ నెల‌కొంది. ఆగ‌స్టులో షో స్టార్ట్ అవుతుంద‌ని… ఈ సారి కూడా అన్న‌పూర్ణ స్టూడియోలోనే బిగ్‌బాస్ కోసం అదిరిపోయే సెట్ వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ ప‌నులు కూడా మొద‌ల‌య్యాయ‌ట‌.

బిగ్‌బాస్ 5వ సీజ‌న్ హౌస్‌మెట్స్ మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఉండేలా నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రెండు స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయ‌ని తెలుస్తోంది. లోప‌ల‌కు హౌస్‌మెట్స్‌గా క‌మెడియ‌న్ ఆలీతో పాటు సీనియ‌ర్ హీరోయిన్ ర‌వ‌ళి వెళ‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బిగ్‌బాస్ 4వ సీజ‌న్లో హౌస్ మెట్స్ విష‌యంలో ఎవ్వ‌రికి సంతృప్తి లేదు. మొత్తం నాలుగు సీజ‌న్ల‌తో పోలిస్తే ఐదో సీజ‌న్ కంటెస్టెంట్లే చాలా చాలా వీక్. అందుకే రేటింగ్ కూడా పెద్ద‌గా రాలేదు.

ఎప్పుడో వీకెండ్‌లో నాగార్జున వ‌చ్చిన‌ప్పుడు మిన‌హా ఎవ్వ‌రికి షోపై పెద్ద‌గా ఆస‌క్తి అయితే లేదు. ఇక ఇప్పుడు ఆలీ బుల్లితెర మీద టాక్ షోలు చేస్తూ బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకే ఆలీకి భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చి మ‌రీ హౌస్‌లోకి తీసుకుంటున్నాడ‌ట‌. ఆలీయే బిగ్ బాస్ 5 షోలోకి వ‌స్తే షోకు అంత‌కు మించిన క్రేజ్ ఉండ‌దు. ఇక సీనియ‌ర్ హీరోయిన్ ర‌వ‌ళికి ఆ త‌రం జ‌న‌రేష‌న్లో మంచి క్రేజ్ ఉంది. ఆమె కూడా హౌస్‌లో ఉంటే 40 + ఆంటీలు, మ‌హిళ‌లు కూడా షోకు క‌నెక్ట్ అవుతార‌న్న‌దే నిర్వాహ‌కుల ప్లాన్‌..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news