Moviesమెగా కోడలు గుడ్ న్యూస్ చెప్పిందోచ్.. శుభవార్త చెప్పిన ఉపాసన కొణిదెల..!!

మెగా కోడలు గుడ్ న్యూస్ చెప్పిందోచ్.. శుభవార్త చెప్పిన ఉపాసన కొణిదెల..!!

మెగా కోడలు.. పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌గా సత్తా చాటుతూ అపోలో లైఫ్ విభాగం వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఉపాసన.. నిత్యం పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి చేత భేష్ అనిపించుకుంటోంది. ముఖ్యంగా ఆమె చేసే సామాజిక సేవలకు ఎందో అభిమానులు ఉన్నారు. కష్టం ఉందంటే చాలు.. వారికి సహాయం అందించేందుకు ఉపాసన ఎప్పుడు ముందుంటారు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఈ ఉపాసన..తాజాగా మెగా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు.

ఉపాసన కామినేని టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉపసనా కామినేని చెల్లెలు అనుష్పాల కామినేని తన ప్రేమ వివాహానికి సంబంధించిన కబురును అందించారు. అనుష్పాల అథ్లెట్ అర్మాన్ ఇబ్రహీంతో ప్రేమలో ఉంది. ఈ మధ్యే ఈ జంట నిశ్చితార్థం పూర్తయింది. ఈ విషయాన్ని అనుష్పాల స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించగా.. ఉపాసన కూడా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ‘నా డార్లింగ్స్‌కి అభినందనలు’ అంటూ ఆమె పేర్కొన్నారు. అనుష్పాలా రాజ కుటుంబీకురాలు. దోమకొండ కోటకు చెందిన కామినేని ఉమాపతి రావు మనవరాలు. శోభన కామినేని- అనీల్ కామినేని కుమార్తె. అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు.అనుష్పాల- అర్మాన్ వివాహం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news