Moviesఆ పాట కోసం చిరంజీవి జ్వరంతో ఉన్నా కూడా డ్యాన్స్ చేసారట..అది...

ఆ పాట కోసం చిరంజీవి జ్వరంతో ఉన్నా కూడా డ్యాన్స్ చేసారట..అది ఏ పాటో తెలుసా..??

చిరంజీవి.. టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన మెగాస్టార్. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. స్వయం కృషితో ఎదిగిన ఒకెఒక్క స్టార్ హీరో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో మన చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు ఘనత మెగాస్టార్ చిరంజీవి కే సాధమైంది.

హీరోగా అడుగు పెట్టినా .. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కష్టఫడి ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. దాదాపు 20ఏళ్ళు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా తెలుగు చిత్ర సీమను ఏలారు మెగాస్టార్ చిరంజీవి. డ్యాన్సులు, ఫైట్స్ అంటూ ప్రేక్షకులకు కొత్త హీరోయిజాన్ని పరిచయం చేశారు చిరు. యంగ్ జనరేషన్ నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి..

అయితే, చిరంజీవి నుండి మెగాస్టార్ చిరంజీవిగా మారడానికి.. ఆయన తన కెరీర్ లో ఎంతో క్ష్టఫడ్డారు.. ఎన్నో సాహసాలు చేసారు. రాత్రింవ్బవళ్లు లెక్కచేయకుండా.. ఆరోగ్యం గురిచి ఆలోచించకుండా..తనని నమ్ముకున్న నిర్యాతలకు లాస్ రాకుడదని ఆరోగ్యం బాగా లేకపోయినా ఎన్నో సినిమా షూటింగ్స్ కంప్లాఇట్ చేసారు. మామూలు నటుడి స్థానం నుంచి సుప్రీమ్, మెగాస్టార్ వంటి బిరుదులను సొంతం చేసుకోవడానికి ఆయన వేసిన స్టెప్పులే ప్రధాన కారణం.

ఆయన చేసే డ్యాన్స్ కు ఆనాటి కుర్రకారును కుర్చీలకు అతుక్కు పోయేలా చేసింది. అప్పుడేంటి ఇప్పుడు కూడా మన మెగాస్టార్ కొడుకు తో సమానంగా స్టెప్పులు ఇరగదీస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ కి బ్రేక్ డాన్స్ లను పరిచయం చేసింది మన చిరంజీవే.

ఇక చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ “జగదేక వీరుడు అతిలోక సుందరి”. ఈ చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి మైన్ ప్లస్ పాటలు. ఇందులోని పాటలన్నీ ఇళయరాజా స్వరపరిచడం ఒక విశేషం. ఈ పాటలు చిరంజీవి సినీ కెరీర్ లో రికార్డు స్థాయిలో విజయవంతమయ్యాయి. అందులోని ప్రతి పాట ఆనాడు తెలుగు ప్రేక్షకుల మతిపోగొట్టాయి.

ఇక ఈ సినిమలో “యమహో నీ యమ యమ అందం.. చెలరేగిందే ఎగా దిగా తాపం.!! ” అనే పాట సమయంలో చిరంజీవికి తీవ్రమైన జ్వరం ఉందట. కానీ జ్వరం అని చెప్పి షూటింగ్ కు వెళ్లక్కపోతే..సినిమా లేట్ అవుతుందని..దీంతో నిర్మాత నష్ట పోకూడదన్న ఉద్దేశంతో జ్వరంలో కూడా చిరంజీవి ఈ పాటకు డ్యాన్స్ చేసారట. ఇక ఈ సినిమా విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news