Moviesఅర్జున్ రెడ్డిని వదులుకున్న బడా హీరో ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

అర్జున్ రెడ్డిని వదులుకున్న బడా హీరో ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

అర్జున్ రెడ్డి.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. బాక్స్ ఆఫిస్ ని షేక్ చేసిన సినిమా ఇది. శివ సినిమా తర్వాత ఇండస్ట్రీలో అంతటి ట్రెండ్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి . ఎన్నో వివాదాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఇక ఈ సినిమాలో హీరోగా నతించిన విజయ దేవరకొండా..సినీ కెరీర్ అంటే.. ‘అర్జున్ రెడ్డి’ సినిమా వరకూ ఓ లెక్క, ఆ సినిమా తరువాత మరో లెక్క. చిన్న సినిమాగా కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ వసూలు చేసిన మొత్తం రూ. 40 కోట్ల పైమాటే. ఇక శాటిలైట్, రీమేక్, డిజిటల్ అన్నీ కలుపుకుని విడుదలకు ముందు, విడుదల తరువాత కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాను కొన్న బయ్యర్లు బంపర్ విక్టరీతో విజేతలుగా మారారు.

ఇక ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, బాలయ్యలను సైతం వెనక్కినెట్టి ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌ను కొల్లగొట్టాడంటే ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక అదరగొట్టే కలెక్షన్స్, అంతకు మించిన క్రేజ్ రెండూ వచ్చాయి అర్జున్ రెడ్డి చిత్రానికి. అయితే ఈ సినిమాను విజయ్ దేవరకొండ కంటే ముందు ఇద్దరు స్టార్ హీరోస్ కి ఈ కధ చెప్పారంట డైరెక్టర్.

అసలు ఆ స్టార్ హీరోస్ ఎవరో వింటే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఈ కథని మొదట డైరెక్టర్ సందీప్ రెడ్డి హీరో అల్లు అర్జున్ కి చెప్పడానికి ప్రయత్నించాడు . అది కుదరకపోవడంతో తర్వాత శర్వానంద్ కి చెప్పాడు. అతనికి కథ నచ్చిన తన ఇమేజ్ కి సరిపోదని రిజెక్ట్ చేసాడు. ఇక కధ అటు ఇటు తిరిగి ఫైనల్ గా విజయదేవరకొండ చేతికి వెళ్లింది. ఇక ఈ సినిమాతో విజయ్ ఫాలోయింగ్ ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ దశ-దిశ తిరిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news