Moviesషాకింగ్: నాగార్జునతో నటించడానికి నో చెప్పిన NTR.. ఎందుకో తెలుసా..??

షాకింగ్: నాగార్జునతో నటించడానికి నో చెప్పిన NTR.. ఎందుకో తెలుసా..??

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేం. సినిమా పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. డేట్లు కుదరక కొన్ని, కథ నచ్చక కొన్ని…..ఇలా కొంతమంది హీరోలు వదులుకున్న సినిమాలు వేరే హీరోల చేతల్లోకి వెళ్లి బ్లాక్ బస్టర్లుగా నిలిచిపోయాయి.!

ఇలా తెలుగులో కూడా అనేక సినిమాలున్నాయి. కొంతమంది దర్శకులైతే కథ రాసేటప్పుడే ఫలానా హీరో అని ఫిక్స్ అయిపోతారు…కానీ ఆ హీరో నో అని చెప్పేసరికే వేరే వాళ్లతో లాగించే ప్రయత్నం చేస్తారు. అలా తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీస్ ను వదులుకున్న హీరోస్ చాలామంది ఉన్నారు. ఇక నందమూరి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్.. అలా చాలా సినిమాలను మిస్ చేసుకున్నాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ఒకటి ఊపిరి.

అక్కినేని నాగార్జున మరియు కార్తీ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది..తొలుత ఈ సినిమాని ఆ చిత్ర దర్శకుడు వంశి పైడిపల్లి అక్కనేని నాగార్జున మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ చేద్దాం అనుకున్నాడు, ఎన్టీఆర్ కూడా ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదండోయ్.. అప్పట్లో పత్రిక ప్రకటనా కూడా చేసారు. అయితే సడెన్ గా ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించేసాడు. దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనితో అప్పటికప్పుడు డైరెక్టర్ కత్తి నాగర్జునతో కలిసి స్టోరీ చెప్పడం.. ఆయన వెంటనే ఓకే చెప్పి.. కార్తీ కూడా ఓకె చెప్పి ఈ సినిమాలో నటించడం అన్ని అలా జరిగిపోయాయి. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news