Moviesశృతిహాసన్ రిజెక్ట్ చెసిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు ఏంటో చూడండి.. కెరీర్...

శృతిహాసన్ రిజెక్ట్ చెసిన బ్లాక్ బస్టర్స్ సినిమాలు ఏంటో చూడండి.. కెరీర్ ఎందుకు డౌన్ అయ్యిందో తెలుస్తుంది..!!

కమల హాసన్ కూతురు గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ సౌత్ ఇండస్ట్రీ లో వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే మారిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు ఇంకా చాలామంది టాప్ హీరోల సరసన నటించడం జరిగింది. సౌత్ లో సక్సెస్ సాధించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుని విజయాలు సాధించడం జరిగింది. కమల్ హాసన్ కూతురు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శృతిహాసన్ సౌత్ ఇండస్ట్రీ లో మాత్రమే కాక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకుంది.

స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో ఆమె లండన్ ప్రేమికుడు మైఖేల్ మాయలో పడి కెరీర్ ని నిర్లక్ష్యం చేసింది అంటారు ఆమె అభిమానులు. అందులో భాగంగానే అప్పట్లో ఆమెకు వచ్చిన అవకాశాలు కూడా వదులుకోవడం జరిగిందని టాక్. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో, శృతి హాసన్ కి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ పెద్దగా రావడం లేదు. ఇది ఇలా ఉంటే కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో శృతి కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది. అవేంటో ఓసారి చూద్దాం..

బిజినెస్ మ్యాన్: మహేష్ బాబు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శృతి హాసన్‌నే అనుకున్నారట. కానీ ఆమె ఏవో కారణాలతో రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం చందమామ కాజల్ అగర్వాల్‌కు వచ్చింది.

జెర్సీ: నాచురల్ స్టార్ నాని హీరో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన జెర్సీ సినిమాలో కూడా శృతి హాసన్‌ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కూడా శృతిహాసన్ కోల్పోయింది.

అమర్ అక్బర్ ఆంటోనీ : మాస్ మహారాజా రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో కూడా శృతిని అనుకున్నారట. కానీ ఈ సినిమాను కూడా శృతి రిజెక్ట్ చేసింది.

దువ్వాడ జగన్నాధం Dj : అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన “దువ్వాడ జగన్నాధం” సినిమా లో కూడా శృతి హాసన్ నే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారట. కానీ శృతి రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు.

రెబెల్: ప్రభాస్, లాఘవ లారెన్స్ కాంబినేషన్‌లో వచ్చిన రెబెల్‌లో కూడా శృతి హాసన్‌ను మొదట అనుకున్నారట. కానీ ఆమె వదులుకోవడంతో ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news