Moviesశ్రీహ‌రి మూవీస్ ల్లోకి రాక‌ముందు ఏం చేసారో తెలిస్తే..అసలు నమ్మలేరు తెలుసా..!!

శ్రీహ‌రి మూవీస్ ల్లోకి రాక‌ముందు ఏం చేసారో తెలిస్తే..అసలు నమ్మలేరు తెలుసా..!!

దివంగత శ్రీహరి రియల్ స్టార్‌గా తన కంటూ మాస్‌లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. అంతకు ముందు శ్రీహరి.. తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి…కామెడీ విలన్‌గా నవ్వులు కురిపించిన సంగతి మనకు తెలిసిందే. ఆతరువాత హీరోగా టర్న్ తీసుకొని .. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనదైన నటనతో అందరిని ఆక్స్ర్షించారు. శ్రీహరి,, ఈ పేరు చెప్పగానే మనకు మంచి మంచి పాత్రలు గుర్తుకు వస్తాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. పోలీస్ గా స్టార్ట్ అయిన ఆయన హీరోయిజం.. ‘భద్రాచలం’, ‘గణపతి’, ‘అయోధ్యరామయ్య’, ‘విజయరామరాజు’ వంటి అనేక పాత్రల్లో రాణించింది.

ఆయన కెరీర్ లో ‘నువ్వుస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలో ఆయన నటనకుగానూ నంది అవార్డు సైతం వరించింది. అందులో భాగంగా అనేక చిత్రాల్లో ఆయన నటించారు. ‘ముఠామేస్త్రి’, ‘మేజర్ చంద్రకాంత్’,‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘అల్లరి ప్రియుడు’, ‘బావగారూ బావున్నారా’, ‘హలోబ్రదర్’ వంటి చిత్రాల్లో వేసింది చిన్న పాత్రలే అయినా.. ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించారు.

అయితే, శ్రీహరి సినిమాలలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా మీకు..??.. ఎలమర్రు లో ఒక రోడ్డు పక్కన.. ఓ చిన్న సైకిల్ మెకానిక్ షాప్ చూసుకునే వాడట మన శ్రీహ‌రి. అప్పుడు సమయం దొరికినప్పుడల్లా..షాప్ కు ముందు ఉన్న శోభన థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసేవాడట. అలా సినిమాలు చూస్తూ చుస్తూ సినిమాలపై ఆసక్తి పొందడంతో.. సినిమాల్లోకి రావాలని కోరుకున్నాడు. ఇకపోతే శ్రీహరికి చిన్నప్పటినుంచి బాడీ బిల్డర్ అవ్వాలి అనేది ఒక పెద్ద కోరిక ఉండేది అట.. అలా ఎన్నోసార్లు బాడీ బిల్డర్ పోటీల్లో పాల్గొన్నారట శ్రీహరి. దాదాపుగా మిస్టర్ హైదరాబాదుగా ఏడుసార్లు అవార్డు కూడా అందుకున్నాడు మన శ్రీహరి. అంతేకాదు 1988వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి , స్టంట్ మాస్టర్ గా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టి తర్వాత ప్రతినాయకుడి పాత్రలలో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news