Movies"రంగస్థలం" సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే.. మైండ్...

“రంగస్థలం” సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే.. మైండ్ బ్లాకే..??

అనుపమా పరమేశ్వరన్ అంటే ఎవ్వరికైనా పద్దతి గల రూపమే గుర్తుకు వస్తుంది. చూడ‌గానే భ‌లేఉందే అనిపించే రూపుతో.. ఆడియ‌న్స్ కు క‌నెక్ట్ అయిపోయిందీ బ్యూటీ. దీంతో.. ఇండ‌స్ట్రీలో త‌క్కువ సినిమాలే చేసిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన ముద్ర వేసిందీ అమ్మ‌డు. ఎప్పుడూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూనే ఉంటుంది. చీరలు లేదా, పంజాబీ డ్రెస్సుల్లో కనిపిస్తూ నెటిజన్లను కట్టిపడుస్తూనే ఉంది.

కేరళ కుట్టి అనుపమా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే సందడికి నెటిజన్లు ఫిదా అవాల్సిందే. చిన్న పిల్లలా మారి చేసే కొంటె చేష్టలు, తన తమ్ముడితో కలిసి చేసే అల్లరిని నెటిజన్లు బాగా ఇష్టపడుతుంటారు. అయితే వెండి తెరపై క్యూట్‌గా కనిపించే ఈ భామ ఎప్పుడూ కూడా తన లిమిట్స్ లోనే ఉంటూ.. అందాల ఆరబోతకు అంత మొగ్గు చూపలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మధ్య కాస్త ఘాటుదనాన్ని జోడిస్తుందిలేండి.

అయితే ఈ భామ ఓ బంపర్ ఆఫర్ ని మిస్ చేసుకుందట. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాం చరణ్ , సమంత కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచింది. అయితే ఇందులో మొదట అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా అనుకున్నారట. ఆ తరువాత సమంత నటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అనుపమ తప్పుకోవడం.. ఆ ప్లేస్ లోకి సమంత రావడం.. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడం చక చక జరిగిపోయాయి. ఏదిఏమైనా ఈ సినిమా మిస్ చేసుకుని అను పెద్ద తప్పు చేసిందంటున్నారు పలువురు సినీ ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news