Moviesఒకే ఒక్కడు సినిమాను రిజెక్ట్ చేసిన ఆ బడా హీరో ఎవరో...

ఒకే ఒక్కడు సినిమాను రిజెక్ట్ చేసిన ఆ బడా హీరో ఎవరో తెలుసా..అసలు నమ్మలేరు..!!

“ఒకే ఒక్కడు”..ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. అప్పట్లో అర్జున్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఒకరోజు ముఖ్యమంత్రి కథతో శంకర్ చేసిన ప్రయోగం అన్ని భాషల్లో వర్కవుట్ అవ్వడం. ఆ సినిమా అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం తెలిసిందే. యాక్షన్ కింగ్ అర్జున్ హీరో, మనీషా కొయిరాలా హీరోయిన్‌గా కోలీవుడ్ లెజండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం ముదల్వాన్‌(తెలుగులో ఒకే ఒక్కడు).

1999లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది. అవినీతి గల సీఎంగా రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ అర్జున్ కెరీర్‌కి ఎంతో ఊపును ఇచ్చింది.

అందులోని ఒక్క రోజు సీఎం అన్న కాన్సెప్ట్‌ ఆ తరువాత చాలా సినిమాల్లో వాడుకున్నారు. అయితే ఈ సినిమాకు అర్జున్ మెదటి ఛాయిస్ కాదట. ఈ మూవీని శంకర్ రజినీకాంత్ ను హీరోగా సెలెక్ట్ చేసుకో గా ఆ సినిమా రజినీకాంత్ రిజెక్ట్ చేశారు.

ఆ తర్వాత ఈ కథను విజయ్ కి వినిపించగా అప్పటికే కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఈ సినిమాను చేయలేకపోయాడు. ఆ తర్వాత అర్జున్ హీరోగా ఈ సినిమాలో నటించి హిట్ కొట్టాడు. ఆ సమయంలో విజయ్ ఈ సినిమా వదులుకొని వేరే చిత్రాల్లో నటించగా భారీ ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. అది ఆయనకు ఎంతో మైనస్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news