Moviesఅబ్బాబ్బాబ్బా..ఏం చేస్తిరి వీళ్లు..కరోనా నిబంధనలతో హాట్ రొమాన్స్..!!

అబ్బాబ్బాబ్బా..ఏం చేస్తిరి వీళ్లు..కరోనా నిబంధనలతో హాట్ రొమాన్స్..!!

ప్రస్తుతం సెలెబ్రెటీలంతా ఎవరో ఒక ఫారినర్ తో చెట్టపట్టాలు వేసుకుని తిరగడం, ఆ వ్యవహారం మీడియాలో బాగా పాపులర్ అవ్వడం, అప్పుడు మేము డీప్ లవ్ లో ఉన్నాం. ప్రస్తుతానికి డేటింగ్ చేస్తున్నాం అంటూ చాలా చక్కగా సమాధానాలు ఇస్తూ ఉంటారు.

ఇక గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ విధంగానే మైఖేల్‌ కోర్సలే అనే లండన్ కుర్రాడి ప్రేమలో మునిగిపోయింది. వీరిద్దరూ చెట్టా పట్టాలేసుకుని తిరగడం, ఒకరి బర్త్‌డేను మరొకరు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడం, సెల్ఫీలతో సోషల్‌ మీడియాలో హడావుడి చేయడం షరామామూలుగా జరిగిపోయాయి. ఇలా చాలాసార్లు చాలా రకాలుగా చాలామంది దృష్టిలో పడ్డారు. వీరి ప్రేమకు శ్రుతీ తండ్రి కమల్‌ కూడా ఒకే చెప్పేసారు. ఇంకేముంది బాజా బజంత్రీలు మోగడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఈ ప్రేమ వ్యవహాంరంలో చిన్న ట్విస్ట్ బయటపడింది. అది ఏంటి అంటే శ్రుతీ, మైఖేల్‌ విడిపోతున్నారు . ఇది ఎవరో కల్పించిన వార్తలు కాదు. స్వయంగా సృస్తి ప్రియుడు మైఖేలే స్వయంగా తన సోషల్‌ మీడియా ద్వారా బ్రేకప్‌ సందేశాన్ని పంపించాడు.

ఆ తరువాత అందాల బ్యూటీ శ్రుతీహాసన్ మ‌ళ్లీ ప్రేమ‌లోపడ్డింది. శ్రుతీ నే స్వయంగా .. తాను ప్రేమ‌లో ఉన్న‌ట్లు ఉన్నాన‌ని వెల్ల‌డించింది. ఇక ఆ త‌రువాత శ్రుతీ హాస‌న్ బ‌ర్త్‌డే వేడుక్ల‌లో సంతాను హ‌జారికా అనే ఒక కొత్త వ్య‌క్తి ద‌ర్శ‌నం ఇవ్వ‌గా.. అత‌డే ఆమె కొత్త బాయ్‌ఫ్రెండ్ అని కంఫాం అయ్యింది. ఈ క్ర‌మంలో అత‌డి గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అసోం రాష్ట్రానికి చెందిన సంతాను మంచి ఆర్టిస్ట్. గువాహతి ఆర్ట్ ప్రాజెక్ట్‌కు ఈ కుర్రాడు కో ఫౌండర్. అంతేకాదు 2014 డూడుల్ ఆర్ట్ కాంబినేషన్‌లో బెస్ట్ డూడల్ ఆర్టిస్ట్‌గా సంతాను గెలుపొందాడు. ఇక ఇత‌డు శ్రుతీతో డేటింగ్ చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు.

తాజాగా శ్రుతీ హాసన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతను హజారికతో కలిసి ముంబైలోని ఓ సూపర్‌మార్కెట్‌లో ప్రత్యక్షమైంది. ఇంకేముందీ ఈ జంటను అక్కడి జనాలు తమ ఫోన్‌ కెమెరాల్లో బంధించడంటో నిమగ్నమయ్యారు. శ్రుతీ కూడా పోజులివ్వడానికి సై అంది. శాంతనుకు హగ్గులిస్తూ, పబ్లిక్‌గా ముద్దులు కూడా పెట్టేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో యాడ్‌ చేసింది. ఇక ఇప్పుడు శ్రుతి హాసన్ అందరి ముందు చేసిన రొమాన్స్ అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈ జంట ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన జనాలు పబ్లిక్‌గా ఆ ముద్దులేంటి? అని నోరెళ్లబెడుతున్నారు.

 

Latest news