‘గజిని’ ని వదులుకున్న స్టార్ హీరోయిన్ ఈమే..!!

గజినీ 2005 లో ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద చిత్రం. ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాను తిరుగులేని విధంగా తెరకెక్కించి సూర్య కి అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ సినిమాలో సూర్య, ఆసిన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఏ ఆర్ మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చిన గజిని సినిమా మన దేశ సినిమా చరిత్రలో ఓ సూపర్ హిట్ సినిమా అనే చెప్పాలి. సూర్య కెరీర్ ని మలుపుతిప్పిన సినిమా “గజినీ”.

గజనీ సినిమాలో సంజయ్ రామస్వామిగా సూర్య ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ మంచి స్టోరీ లైనప్ సూర్యకి అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో మంచి హిట్ గా నిలిచింది. సూర్య కెరీర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా గజిని ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక నయనతార, ఆసిన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి..దాదాపు ఆ ఏడాది అన్నీ అవార్డులు ఈ సినిమాకి వచ్చాయి.అయితే గజిని సినిమా కథ సూర్య కంటే ముందు దాదాపు 10 మంది హీరోలకు చెప్పాడు మురుగదాస్ ..చివరకు ఫైనల్ గా దీనిని సూర్య ఒకే చేశారు.

అయితే గజిని సినిమా కోసం ముందుగా హీరోయిన్స్ గా ఆసిన్, శ్రీయను అనుకున్నాడు మురుగదాస్. కానీ శ్రీయ బిజీగా ఉండటంతో..డేట్స్ కుదరక పోవడంతో ఈ క్యారెక్టర్ నయనతారకి వెళ్ళింది. ఇక ఈ సినిమాలో నయనతార యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి.

కానీ దర్శకుడు మురుగదాస్ కథ చెప్పినప్పుడు తన పాత్ర గురించి ఒకలా చెప్పి.. చివరికి సిల్వర్ స్క్రీన్‌పై మరోలా చూపించారంటూ అప్పట్లో నయన్ ఆవేదన చెందింది. అంతేకాకుండా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలన్న గుణపాఠం ‘గజినీ’ సినిమా ద్వారా స్పష్టమైందని నయన్ తెలిపింది. మొత్తానికి భారీ అంచనాల మధ్య 2005లో విడుదలైన గజిని సంచలన విజయం సాధించింది.