నితిన్ ‘ మాస్ట్రో ‘ కు క‌ళ్లు చెదిరే డీల్‌… బిజినెస్ లెక్కలివే

నితిన్ రంగ్ దే , చెక్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా త‌న స్థాయికి త‌గిన హిట్ ఇవ్వ‌డం లేదు. ఇక ఇప్పుడు నితిన్ అశ‌లు అన్ని మాస్ట్రో సినిమా మీదే ఉన్నాయి. అయితే ఈ సినిమా క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లలోకి రావ‌డం లేద‌ని.. ఓటీటీకి వెళుతోంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఫైన‌ల్ డీల్‌ను క్లోజ్ చేసేశార‌ని తెలుస్తోంది. మాస్ట్రోను హాట్ స్టార్ రు. 32 కోట్ల‌కు కొనేసింది. ఈ డీల్ కాకుండా ఇంకా అడియో రైట్స్, ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ నిర్మాతకు వున్నాయి.

బాలీవుడ్ లో హిట్ అయిన అంథాదూన్ సినిమా ఆధారంగా మాస్ట్రో ను నిర్మించారు. ఈ సినిమాకు రు. 29 కోట్ల వరకు ఖర్చయిందంటున్నారు. ఈ లెక్క‌న చూస్తే నిర్మాత సుధాక‌ర్ రెడ్డికి మంచి లాభ‌మే అని చెప్పాలి. జూలై చివ‌రు నాటికి షూటింగ్ పూర్తి చేసి… ఆగస్టు రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.