ఈ విలన్స్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ఒక సినిమా హిట్ అవ్వాలంటే అందులో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసే అంశాలు కచ్చితంగా ఉండాలి. ఒక వేళ అవన్నీ కరెక్ట్ గా ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఒక వేళ అదే సినిమా లవ్ స్టోరీ అయితే హీరో, హీరోయిన్ పెయిర్ కూడా బాగుండాలి. దాదాపు ప్రతి సినిమాలో హీరో, హీరోయిన్ కి మధ్య ఒక లవ్ ట్రాక్ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ వాళ్ళ మధ్యలో విలన్ ఎంటర్ అయితే .. ఇంకేముంది సినిమా బ్లాక్ బస్టర్ నే. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో, హీరోయిన్ ఎంత ముఖ్యమో.. విలన్ కూడా అంతే ముఖ్యం.

ఈ మధ్య సినిమాలలో ఎక్కువగా హీరోలకు సమాన క్రేజ్ ఉండేటట్లు విలన్ లను చూపిస్తున్నారు. అంతేకాకుండా విలన్ లను ఎన్నుకునే విషయంలో కూడా స్టార్ నటులను ఎంచుకుంటున్నారు. ఇక పారితోషకాల విషయంలోను విలన్ లు ఏమాత్రం తగ్గట్లేదు. విలన్ అంటే ఇలానే ఉండాలి అనేలా భారీగా రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. అలా తెలుగు ఇండస్ట్రీలో భారీ పారితోషికం అందుకుంటున్న విలన్స్ లో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

జగపతిబాబు.. ఒకప్పటి ఈ హీరో ఇప్పుడు విలన్‌గా బిజీ అయ్యాడు. లెజెండ్ సినిమాతో విలన్ గా మారి వరుస విలన్ పాత్రకు ఎంపిక అవుతున్న జగపతిబాబు.. సినిమాకు కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటున్నాడట. కెరీర్ మొదట్లో విలన్‌గా నటించి ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు శ్రీకాంత్. నాగచైతన్య యుద్ధం శరణం సినిమాతో విలన్ గా మారిన శ్రీకాంత్ అఖండ సినిమాకి కోటికి పైగానే పారితోషకాన్ని అందుకుంటున్నాడు. ప్రకాష్ రాజ్.. ఒక్క రోజుకు 10 లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తుంటాడు..అంతేకాదు డిమాండ్ బట్టి కొన్ని సినిమాలకు కోటిన్నర వరకు తీసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్. ఇక రీల్ విలన్..రియల్ హీరో సోనూ సూద్..ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఇక అలాగే.. సంపత్ రాజ్ 40 లక్షలు, సాయి కుమార్ 50 లక్షలు, సుదీప్ మూడు కోట్లు, ఆది పినిశెట్టి కోటి, రవికిషన్ 40 లక్షలు వరకు ఛార్జ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.