బ్రేకింగ్‌: MAA elections: ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ ఇదే

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ త‌న ప్యానెల్లో పోటీ చేసే 27 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన జాబితాను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మా శ్రేయ‌స్సు దృష్ట్యా, మా ప్ర‌తిష్ట‌, మా న‌టీన‌టుల బాగోగుల కోస‌మే తాను ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్లో పోటీ చేస్తోన్న 27 మంది స‌భ్యుల జాబితా ఇదే..

1- ప్ర‌కాష్‌రాజ్ 2- శ్రీకాంత్‌, 3-బెన‌ర్జీ, 4-సాయికుమార్‌, 5-జ‌య‌సుధ‌, 6- త‌నీష్‌, 7-ప్ర‌గ‌తి, 8-అనసూయ‌, 9-స‌న‌, 10-అనితా చౌద‌రి, 11-సుధ‌, 12-అజ‌య్‌, 13-నాగినీడు, 13- బ్ర‌హ్మాజీ, 14 – ర‌విప్రకాష్‌, 15- స‌మీర్‌, 16- ఉత్తేజ్‌, 17- బండ్ల గ‌ణేష్‌, 18- ఏడిద శ్రీరామ్‌, 19- శివారెడ్డి, 20- భూపాల్‌, 21- టార్జాన్‌, 22- సురేష్ కొండేటి, 23- సుడిగాలి సుధీర్‌, 24- ఖ‌య్యూం, 25- గోవింద‌రావు, 26- శ్రీధ‌ర్ రావు, 27 – శివారెడ్డి ఈ ప్యానెల్లో ఉన్నారు.

ఇదిలా ఉంటే మా లో చ‌తుర్ముఖ పోటీ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌కు పోటీగా మంచు విష్ణు ప్యానెల్ దిగుతోంది. ఇక జీవ‌తా రాజ‌శేఖ‌ర్‌, హేమ కూడా రంగంలో ఉన్నారు