పుష్ప గురించి ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్‌…

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్‌, క్రేజ్ ఇప్పుడు ఎలా పెరిగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అల వైకుంఠ‌పురం సినిమాకు ముందు వ‌ర‌కు బ‌న్నీ వేరు.. ఇప్పుడు బ‌న్నీ వేరు. ఇప్పుడు బ‌న్నీ క్రేజ్ మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప‌వ‌న్‌ల‌ను మించే ఉంద‌ని చెప్పాలి. సినిమాలు, సోష‌ల్ మీడియా, ఇత‌ర భాష‌ల్లో మార్కెట్‌, క‌లెక్ష‌న్లు ఇవ‌న్నీ పై ముగ్గురు క్రేజీ హీరోల‌ను మించి పోయి బ‌న్నీకి ఉన్నాయి. గ‌త బ్లాక్ బ‌స్ట‌ర్ అల త‌ర్వాత ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇటు సుక్కు కూడా రంగ‌స్థ‌లం లాంటి యునాన‌మ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని పుష్ప మీదే వ‌ర్క్ చేస్తున్నాడు.

ఇక పుష్ప గురించి వ‌స్తోన్న వార్త‌లు ఎగ్జైట్మెంట్ పెంచేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి, బ‌న్నీ రోల్ గురించి ఫ్యీజులు ఎగిరిపోయే అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా పుష్ప‌లో ర‌ష్మీక గిరిజ‌న అమ్మాయిగా క‌నిపిస్తుండ‌గా… బ‌న్నీ కూడా ఆమెను ప్రేమించే గిరిజ‌న యువ‌కుడి గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అందుకే ఆ చిత్తూరు యాస‌ను చాలా క‌ష్ట‌ప‌డి మ‌రీ నేర్చుకున్నాడ‌ని తెలుస్తోంది. త‌మిళ‌నాడు, చిత్తూరు స‌రిహ‌ద్దుల్లోని ఓ గిరిజ‌న గ్రామానికి సంబంధించిన క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

గిరిజ‌న విలేజ్‌కు సంబంధించిన బ్యాక్ డ్రాప్ కావ‌డంతో ఆ వాతావ‌ర‌ణం ఉండేలా సెట్టింగులు, ప్ర‌జ‌లు, వారి వేష , భాష‌లు ఇలా అన్నింటిమీదా సుకుమార్ బాగా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. బన్నీ మాత్రం పుష్ప రాజ్ రోల్ లో సరికొత్త పెర్ఫామెన్స్ అదరగొట్టడం క‌న్ ఫార్మ్ అని అంటున్నారు.