వావ్‌… నాని శ్యామ్ సింగ‌రాయ్ క‌థ ఇదే… !

నేచురల్‌ స్టార్‌ నాని ప్ర‌స్తుతం `టక్‌ జగదీష్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో `శ్యామ్‌ సింగరాయ్‌` సినిమా చేయ‌బోతున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో నానికి జోడీగా సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

 

 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ నుంచి సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా క‌థకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఒక కాలంకు చెందిన వ్యక్తి మృతి చెంది మళ్లీ పుట్టడమే ఈ చిత్ర కథ అని తెలుస్తోంది. గత జన్మ గుర్తుకు రావడం లేదా గత జన్మకు సంబంధించిన ఏదైనా కార్యం పూర్తి చేయడం పైనే ఈ సినిమా సాగుతుంద‌ని అంటున్నారు.

 

 

ఈ క్ర‌మంలోనే నాని డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అందులో కోల్ కత్తా కు చెందిన వ్యక్తి పాత్ర ఒక‌టి కాగా.. మ‌రొక‌టి తెలుగు వ్య‌క్తి పాత్ర అని స‌మాచారం. ఒక‌వేళ ఇది నిజ‌మైతే సినిమా ఆస‌క్తిక‌రంగా ఉండ‌టం ఖాయమ‌ని అంటున్నారు. కాగా, కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు.