వామ్మో.. నాగ చైత‌న్య `ల‌వ్ స్టోరి`కి అంత‌ ఖ‌ర్ఛు పెట్టారా?

అక్కినేని నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం `ల‌వ్ స్టోరి`. శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై కె నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేపథ్యంలో వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్.. ఈమధ్యే పూర్తయింది.

 

రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయమని ఇప్ప‌టికే తేల్చి చెప్పిన చిత్ర యూనిట్‌.. డిసెంబ‌ర్‌లో థియేట‌ర్‌లోనే విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా బ‌డ్జెట్ గురించి ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. చైతు కెరీర్‌లో ఏ సినిమాకు కూడా ఎక్కువ బ‌డ్జెట్ పెట్ట‌లేద‌నే టాక్ ఉంది. అయితే ల‌వ్ స్టోరి విష‌యంలో మాత్రం అందుకు భిన్నంగా జ‌రిగింద‌ట‌.

 

ఇండిస్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 35 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని తెలుస్తోంది‌. అయితే క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో పైనాన్స్ వంటివి క‌లుపుకుని చివ‌ర‌కు రూ. 38 నుంచి రూ. 40 కోట్లు `ల‌వ్ స్టోరి`కి ఖ‌ర్చు అయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మేతే.. ఇప్ప‌టి వ‌ర‌కు నాగ‌ చైత‌న్య న‌టించిన సినిమాల్లో ఇదే భారీ బ‌డ్జెట్ చిత్రం అవుతుంది.