ప‌వ‌న్ చాయిస్‌పై ఫ్యాన్స్‌లో అస‌హ‌నం..!

`వ‌కీల్ సాబ్`‌తో రీ ఎంట్రీ ఇస్తున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న 27వ సినిమాను క్రిస్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ గా తెరకేక్కబోతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తుండ‌గా.. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.

 

 

ఇదిలా ఉంటే.. గ‌త నాలుగు రోజులుగా ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా ఇస్మార్ట్ శంక‌ర్ ఫేమ్ నిధి అగ‌ర్వాల్‌ను ఎంపిక చేసిన‌ట్టు తెగ వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌ను కొంద‌రు న‌మ్మితే.. మ‌రికొంద‌రు మాత్రం కొట్టిపారేశాడు. కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. నిధి అగ‌ర్వాల్‌నే ప‌వ‌న్‌-క్రిష్ ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌టిన కూడా రానుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

 

 

అయితే నిధి అగ‌ర్వాల్‌ని ఫిక్స్ చేయ‌డంపై.. ప‌వ‌ర్ స్టార్ అభిమానులు గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. పవన్ ఫిజిక్ మరియు ఆమె ఫిజిక్ ఏమాత్రం సెట్ కాద‌ని, వ‌య‌సులో వారి మ‌ద్య చాలా తేడా ఉంద‌ని అంటున్నారు. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామర్ తో నెట్టుకొస్తోన్న ఈ బ్యూటీకి పవన్ సినిమాలో నటించేంత టాలెంట్ లేద‌ని మ‌రి కొంద‌రు భావిస్తున్నారు. అందుకే పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ సరైన ఎంపిక కాద‌ని అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.