ఆ ఒక్క సీన్‌కే గౌత‌మ్‌కు ప‌డ్డానంటోన్న కాజ‌ల్‌… ఆ సీన్ ఇదే…

ముదురు ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఊరించి ఊరించి ఎట్ట‌కేల‌కు ఓ ఇంటిది అయ్యింది. ఆమె త‌న స్నేహితుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లి చేసుకుని హ‌నీమూన్ కూడా ఫినిష్ చేసుకుని మ‌ళ్లీ తిరిగి షూటింగ్‌ల్లో మునిగి పోనుంది. ఇదిలా ఉంటే కాజ‌ల్ గౌత‌మ్‌కు ఒకే ఒక్క సీన్‌కు ప‌డిపోయింద‌ట‌. అంద‌రు అమ్మాయిల్లాగానే త‌న ప్రియుడు గౌత‌మ్ త‌న‌కు మోకాళ్ల‌పై కూర్చొని ప్ర‌పోజ్ చేయాల‌ని కోరుకుంద‌ట‌. త‌న ప్రియుడు కూడా తాను కోరుకున్న‌ట్టు ప్ర‌పోజ్ చేయ‌డం వ‌ల్లే తాను గౌత‌మ్‌ను పెళ్లాడాన‌ని కాజ‌ల్ చెప్పింది.

 

 

అంతేకాదు గౌత‌మ్ అలా ప్ర‌పోజ్ చేయ‌క‌పోయి ఉంటే తాను అత‌డిని పెళ్లాడేదాన్ని కాదేమో అని కొంటెగా ఓ కామెంట్ కూడా రువ్వింది. ఏ అమ్మాయి అయినా ప్రియుడి నుంచి ఇలాంటి ప్ర‌పోజ్ కోరుకుంటుంది క‌దా ? అని ప్ర‌శ్నించింది కూడా..?  ఇక గౌత‌మ్ త‌న ప్రేమ‌ను ముందుగానే కాజ‌ల్ త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడి ఒప్పించుకున్నాడ‌ని… అయినా త‌న‌కు మాత్రం మోకాళ్ల మీద కూర్చొని ప్ర‌పోజ్ చేస్తేనే పెళ్లికి ఒకే చెపుతాన‌ని కాజ‌ల్ కండీష‌న్ పెట్టింద‌ట‌.

 

 

ఇక త‌న భ‌ర్త గురించి కాజ‌ల్ ఆకాశానికి ఎత్తేస్తోంది. గౌత‌మ్ ఎంతో ప‌రిణితి క‌ల వ్య‌క్తి అని.. ఎలాంటి చెడు ఆలోచ‌న‌లు కూడా అత‌డికి లేవ‌ని కాజ‌ల్ చెప్పి మురుసు కుంటోంది. ఇక ఈ కొత్త జంట ప్ర‌స్తుతం మాల్దీవుల్లోని అండ‌ర్ వాట‌ర్ హ‌నీమూన్‌లో ఎంజాయ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.