ఎన్టీఆర్ యాక్టింగ్ వేరే లెవ‌ల్… మెస్మ‌రైజ్ అయ్యానన్న సీనియ‌ర్ హీరోయిన్‌

సీనియ‌ర్ న‌టి, లేడీస్ టైల‌ర్ ఫేం హీరోయిన్ అర్చ‌న జూనియ‌ర్ ఎన్టీఆర్ యాక్టింగ్‌పై ఓ రేంజ్‌లో ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో పాటు అత‌డిని ఆకాశానికి ఎత్తేసింది. చాలా రోజుల త‌ర్వాత అర్చ‌న ఆలీతో జాలీగా ప్రోగ్రాం ద్వారా మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తెలుగులో ఇటీవ‌ల కాలంలో మీరు చూసిన మంచి సినిమాలు ఏవి అని ఆలీ అడిగిన ప్ర‌శ్న‌కు అర్చ‌న మ‌హాన‌టి, జ‌న‌తా గ్యారేజ్ రెండు సినిమాలో వేరే లెవ‌ల్లో ఉన్నాయ‌ని చెప్పింది. ఇప్ప‌టి హీరోల్లో ఎవ‌రు బాగా న‌టిస్తున్నార‌ని అడ‌గ‌గానే.. ఎన్టీఆర్ బాగా న‌టిస్తున్నాడ‌ని… జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌ట వేరే లెవ‌ల్లో ఉంద‌ని ఆమె ప్ర‌శంస‌లు కురిపించింది.

 

జ‌న‌తా గ్యారేజ్‌లో మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ చాలా ఇన్‌స్పైరింగ్ క్యారెక్ట‌ర్ చేశార‌ని… అందులో మోహ‌న్‌లాల్ స్పేస్ ఆయ‌న‌కు ఇచ్చేసి… ఎన్టీఆర్ స్పేస్ ఎన్టీఆర్ తీసుకుని న‌టించ‌డం చాలా క‌ష్ట‌మైంద‌ని అర్చ‌న చెప్పింది. అలా చేయ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అయిన‌ప్ప‌టి కూడా ఎన్టీఆర్ దానిని చాలా ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశాడ‌ని అర్చ‌న ప్ర‌శంస‌లు కురిపించేసింది. ఏదేమైనా జ‌న‌తా గ్యారేజ్‌లో ఎన్టీఆర్ న‌ట‌న వేరే లెవ‌ల్లో ఉంద‌ని తెగ పొగిడేసింది.