శ్రీ రాపాక రేటు ఇదే…. బాగా పెంచేసిందే..!

హాట్ కంటెంట్ సినిమాల్లో హాట్ హాట్‌గా సెగ‌లు ఒల‌క‌బోస్తోంది శ్రీ రాపాక‌. రాంగోపాల్ వ‌ర్మ న‌గ్నం సినిమాలో న‌టించిన శ్రీ సంచ‌ల‌నానికి తెర‌దీసింది. ఆ సినిమాలో ఆమె హాట్ హాట్ భంగిమ‌ల‌కు కుర్రోళ్ల మ‌తులుపోయాయి. తొలి సినిమాలోనే మ‌త్తెక్కించే భంగిమ‌ల‌తో శ్రీ రాపాక ఓ రేంజ్‌లో చెల‌రేగిపోయింది. ఆ సినిమా త‌ర్వాత ఆమెకు హాట్ క్రేజ్ బాగా వ‌చ్చేసింది. అయితే ఆ సినిమాకు ఆమెకు రోజుకు రు. 1 – 2 ల‌క్ష‌లు మాత్ర‌మే రెమ్యున‌రేష‌న్ వ‌చ్చింద‌ట‌.

 

అయితే ఇండ‌స్ట్రీలో మాత్రం త‌న‌కు అంత‌కు మించిన రెమ్యున‌రేష‌నే ఇచ్చార‌న్న గుస‌గుస‌లు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆమె రెండు మూడు హాట్ సినిమాల్లో న‌టించేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఆమె తాజా చిత్రం కాత్యాయ‌ని. 1990 నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. ఈ చిత్రానికి కూడా రాపాక మంచి పారితోషికమే అందుకుంటున్నారని టాక్‌.

ఆమె కాస్త హాట్‌గా క‌నిపించేందుకు ఎలాంటి అభ్యంత‌రాలు పెట్ట‌క‌పోవ‌డంతో ఆమెకు ఒక్కో సినిమాకు రు. 10 ల‌క్ష‌ల‌కు పైగానే ఇచ్చేందుకు మేక‌ర్స్ సై అంటున్నార‌ట‌. ఏదేమైనా శ్రీ రాపాక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంద‌నే చెప్పాలి.