నేను తాగుతా… ద‌మ్ముకొడ‌తా… ఎన్టీఆర్ హీరోయిన్ ఏం చేసిందంటే…

ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత అనురాగ్ క‌శ్య‌పై లైంగీక వేధింపుల ఆరోప‌ణలు చేసింది న‌టి పాయ‌ల్ ఘోష్‌. అనంత‌రం ఆమె త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని కోర్టుల్లో పోరాటాల‌కు దిగింది. ఈ ఒక్క వివాదంతోనే ఆమె ఒక్క‌సారిగా నేష‌న‌ల్ వైడ్ పాపుల‌ర్ అవ్వ‌డంతో పాటు ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యింది. పాయ‌ల్ మ‌న తెలుగు వాళ్ల‌కు కూడా బాగా ప‌రిచ‌య‌మే. ఆమె ఎన్టీఆర్ ఊస‌ర‌వెల్లి సినిమాలో న‌టించింది.

 

తాజాగా పాయ‌ల్ ఓ స్పైషీ ఫోటో షేర్ చేయ‌డంతో పాటు మ‌హిళా హ‌క్కుల గురించి ప్ర‌స్తావించింది. నేను తాగుతాను… ద‌మ్ము కొడ‌తాను… మీకు చొంగ కార్చే హ‌క్కులేద‌ని పాయ‌ల్ చేసిన కామెంట్ పెద్ద వివాదం రేపుతోంది. స్త్రీ, పురుష స‌మాన‌త్వంపై ఆమె ఆలోచ‌న మంచిదే అయినా ఆమె చేసిన కామెంట్‌పై మాత్రం తీవ్ర విమ‌ర్శలు వ్య‌క్తం అవుతున్నాయి. స్త్రీ, పురుష స‌మాన‌త్వం విష‌యంలో మ‌నం చాలా దూరంలో ఉన్నాం… మ‌హిళ‌గా నా జీవితం స్వేచ్ఛ‌గా గ‌డిపేందుకు నాకు అన్ని హ‌క్కులు ఉన్నాయ‌ని పాయ‌ల్ పేర్కొంది.

 

నేను పొగ తాగుతాను… మందు కొడ‌తాను… పొట్టి దుస్తులు ధ‌రిస్తాను.. నేను ఏం చేసినా మీ పురుషుల‌కు చొంగ కార్చే హ‌క్కులేద‌ని చెప్పింది. ఏదేమైనా స్త్రీ, పురుషుల మ‌ధ్య స‌మాన‌త్వం విష‌యంలో ఆమె కంపేరిజ‌న్ మాత్రం చెత్త‌గా ఉంద‌నే ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. వార్త‌ల్లో ఉండేందుకు పాయ‌ల్ ఇప్పుడు కాంట్ర‌వర్సీకి అల‌వాటు ప‌డుతోంద‌నే అర్థ‌మ‌వుతోంది.