ఈ హీరోయిన్‌కు పెళ్ల‌య్యి విడాకులు కూడానా..!

అదితి రావు హైదరి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ ద‌ర్శ‌క‌త్వంతో వ‌చ్చిన `సమ్మోహనం` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదితి రావు హైద‌రి.. ఆ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న‌ అంతరిక్షంలో న‌టించింది. ఇటీవ‌ల నాని `వి`లో మెరిసింది. వాస్త‌వానికి ఈ అమ్మడు హైద్రాబాదీనే అయినా.. మొద‌ట తమిళ్, హిందీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

 

 

ఆ త‌ర్వాత తెలుగు చిత్రాల్లో న‌టించింది. ఇక అదితి ప‌ర్స‌న‌ల్ విష‌యానికి వ‌స్తే.. ఈమెకు ఎనిమిదేళ్ల క్రితమే పెళ్లి అయింది. కానీ, ఈ విష‌యం చాలా త‌క్కువ మందికే తెలుసు. 2006లో మళయాళంలో వచ్చిన ‘ప్రజాపతి’ సినిమా ద్వారా సినీ రంగ ప్ర‌వేశం చేసిన అదితి బాలీవుడ్‌ నటుడు సత్యదీప్‌ మిశ్రాను 2009లో పెళ్లి చేసుకుంది.

 

 

స‌త్య‌దీప్ ఇన్‌కంటాక్స్‌ రంగంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేశారు. ఆ తరువాత నటుడిగా మారాడు. అయితే స‌త్య‌దీప్‌-అదితి దాంప‌త్య జీవితం మొద‌ట్లో బాగానే సాగినా.. ఆ త‌ర్వాత మనస్పర్థలతో విడిపోయే పరిస్థితి ఏర్పడింది. చివ‌ర‌కు 2013లో భ‌ర్త నుంచి విడాకులు తీసుకుని.. కెరీర్‌పై దృష్టి పెట్టింది అదితి. ప్ర‌స్తుతం తెలుగుతో పాలు త‌మ‌ల్‌, హిందీ చిత్రాల‌తో ఫుల్ బిజీ హీరోయిన్‌గా మారింది.