హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాలో నాగార్జున‌కు డూప్‌గా చేసిస‌న స్టార్ హీరో తెలుసా..!

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగ‌ర్జున్ కెరీర్‌లో ఆల్ టైం హిట్స్ గా నిలిచిన సినిమాల్లో ‘హలో బ్రదర్’ ఒక‌టి. ఇ.వి.వి. సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సౌందర్య మ‌రియు రమ్యకృష్ణ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే ఈ చిత్రంలో నాగార్జున ఫ‌స్ట్ టైమ్‌ డ్యూయ‌ల్ రోల్ చేశారు. మాస్‌, క్లాస్, కామెడీ ఇలా అన్నీ ఉన్న ఈ చిత్రం 1994లో విడుద‌లైన సూప‌ర్ హిట్‌గా న‌లిచింది.

 

 

 

 

అయితే ఈ చిత్రంతో నాగార్జున‌తో పాటు మ‌రో స్టార్ హీరో కూడా న‌టించాడు. ఆయ‌నే శ్రీ‌కాంత్‌. అదేంటి, హలో బ్రదర్ సినిమాలో శ్రీ‌కాంత్ ఎక్కడ ఉన్నాడు అనే సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. నిజానికి ఈ చిత్రంలో నాగార్జున రెండు సీన్లలో కనిపించే సన్నివేశాల్లో హీరో శ్రీకాంత్ ఆయ‌న డూప్‌గా న‌టించార‌ట‌.

 

 

ఈ విష‌యాన్ని స్వ‌యంగా నాగార్జునే ఇటీవ‌ల వెల్ల‌డించారు. కాగా, శ్రీకాంత్ – ఇ.వి.వి. సత్యనారాయణ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే ‘హలో బ్రదర్’ చిత్రంలో నాగార్జున.. ఇద్దరుగా కనిపించే సన్నివేశాల్లో ఆయనకు డూప్‌గా నటించేందుకు ఇ.వి.వి శ్రీకాంత్‌ను తీసుకున్నార‌ట‌. అయితే శ్రీ‌కాంత్ ఈ చిత్రంలో న‌టించార‌న్న విష‌యమే చాలా మందికి తెలియ‌దు.