ఆ హీరోయిన్ బ‌ట్ట‌లు మార్చుకుంటుంటే… నిర్మాత చాటుగా ఆ ప‌ని చేశాడా..!

సినిమా ఇండ‌స్ట్రీల్లో `కాస్టింగ్ కౌచ్` అనే ప‌థం ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీలో చాలా మంది కాస్టింగ్ కౌచ్ ఉచ్చులో ప‌డి నానా ఇబ్బంద‌లు ప‌డ్డారు.. ప‌డుతున్నారు కూడా. అయితే తాజాగా ఇరానీ నటి మందాన కరిమీ కూడా ఓ నిర్మాత నుంచి త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని బ‌య‌ట పెట్టింది.

 

 

ప్రస్తుతం మందనా సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కోకో కోలా’ చిత్రంలో నటిస్తోంది. అయితే షూటింగ్ సమయంలో ఆ చిత్రం స‌హ నిర్మాత త‌న‌తో అసభ్యంగా ప్రవర్తించాడంటూ మందాన ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఒక రోజు తాను బట్టలు మార్చుకుంటుంటే క్యారీవాన్‌లోకి కూడా వచ్చేసాడని.. అక్కడ తనతో స‌ద‌రు నిర్మాత చాలా అసభ్యంగా ప్రవర్తించాడని మందాన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

 

 

ఇదంతా కోకో కోలా సినిమా షూటింగ్‌ చివరి రోజు అయిన దీపావళి ముందు రోజు సెట్‌లో చోటుచేసుకుందని మందాన తెలిపింది. అలాగే స‌ద‌రు నిర్మాత కుమారుడు కూడా త‌న‌ను చాలా సార్లు మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు చేసింది. దీంతో నెటిజ‌న్లు స‌ద‌రు నిర్మాతపై నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి వారి వ‌ల్లే సినిమా ఇండ‌స్ట్రీపై చెడు అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌వుతుంద‌ని మండిప‌డుతున్నారు.