తార‌క్ కోసం ఆ ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్లు…!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో చేయ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` షూటింగ్‌లో బిజీగా ఉన్న తార‌క్‌ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి త్రివిక్ర‌మ్ సినిమాలో పాల్గొనున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

 

 

పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీ న‌టించే హీరోయిన్ ఎవ‌రు అన్న‌ది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టికే పూజా హెగ్డే, కీర్తి సురేష్‌, జాన్వీ కపూర్‌, కేతిక శర్మ వంటి పేర్లు వినిపించినా.. క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. త్రివిక్రమ్ మ‌దిలో బిజీ బ్యూటీ కియరా అద్వానీ పేరు ఉంద‌ట‌.

 

 

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆమెతో సంప్ర‌దింపులు జ‌రిపే ప‌నులో త్రివిక్ర‌మ్ ప‌డ్డార‌ట‌. ఒక‌వేళ ఆమె డేట్స్ దొర‌క‌క‌పోతే.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నాను హీరోయిన్‌గా ఎంపిక చేయాల‌ని త్రివిక్ర‌మ్ ఫిక్స్ అయ్యార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. కియ‌రా, ర‌ష్మిక‌ల్లో ఎవ‌రు ఎన్టీఆర్‌కు జోడీ అవుతారో చూడాలి.