ప‌వ‌న్ ప‌క్క‌న ఆ హీరోయిన్ చిన్న‌దైపోదూ… ఇదేం కాంబినేష‌న్ బాబు…!

దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత క్రిష్ జాగర్లమూడితో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేయ‌బోతున్నాడు. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

 

 

ఇంత‌లో క‌రోనా మ‌హ‌మ్మారి రావ‌డంతో.. షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ఇక ఈ సినిమాకు విరూపాక్ష అనే బలమైన టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. ఈ చిత్రంలో ఇస్మార్ట్ శంక‌ర్ ఫేమ్ నిధి అగర్వాల్ ప‌వ‌న్‌కు జోడీగా ఎంపిక అయిన‌ట్టు వార్త‌లు జోరుందుకున్నాయి.

 

 

అయితే దీనిపై కొంద‌రు నెటిజ‌న్లు వ్య‌తిరేఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి ఏ మాత్రం సెట్ కాద‌ని అంటున్నారు. వ‌య‌సులో వారిద్ద‌రికీ చాలా వ్య‌త్యాసం ఉంద‌ని.. దాంతో ప‌వ‌న్ ప‌క్క‌న నిధి మ‌రీ చిన్న‌దిగా క‌నిపిస్తుంద‌ని కామెంట్లు చేస్తున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ అభిమానులు కూడా ఇదేం కాంబినేష‌న్ అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఇక నెట్టింట్లో ఇంత ర‌చ్చ జ‌రుగుతున్నా.. నిధి ప‌వ‌న్ సినిమాలో ఉందో?లేదో? అన్న‌ది మాత్రం క్రిష్‌ రివిల్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.