శోభన్ బాబు అందుకే నటించడం ఆపేసారా.. అసలు కారణం చెప్పిన అలీ..!

అలనాటి ప్రేమ చిత్రాలన్నింటికీ కేరాఫ్… మొన్నటి తరం లవర్ బాయ్ తెలుగు చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు ప్రస్థానం ఎంత అద్భుతంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సోగ్గాడి గా ఎంతో మంది యువతులకు కలల రాకుమారుడిగా కొనసాగాడు శోభన్ బాబు. అయితే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన శోభన్ బాబు ఉన్నట్టుండి సినిమాల్లో నటించడం ఆపేసిన విషయం తెలుస్తుంది. ఇక ఉన్నఫలంగా శోభన్ బాబు ఎందుకు సినిమాలు ఆపేసారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

 

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హాజరైన కమెడియన్ అలీ శోభన్ బాబు సినిమాలు చేయకపోడానికి గల కారణం ఏమిటి అని చెప్పుకొచ్చాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అందగాడిగా సోగ్గాడి గా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు అదే క్రేజ్ తో సినిమాలో నుంచి తప్పుకోవాలని అనుకున్నారని అందుకే వయస్సు వచ్చిన తర్వాత సినిమాలు చేయకూడదని నిర్ణయించుకొని నటనకు దూరమయ్యారు అంటూ అలీ చెప్పుకొచ్చాడు. అందుకే తనకు కొంత వయస్సు వచ్చింది అని నిర్ణయించుకున్న తర్వాత మళ్లీ నటన వైపు తిరిగి చూడలేదు అంటూ చెప్పాడు కమెడియన్ అలీ.